Whatsapp Tricks : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ట్రిక్.. టైప్ చేయకుండానే మెసేజ్, కాల్స్ చేసుకోవచ్చు తెలుసా? ఇదిగో ప్రాసెస్..!
Whatsapp Tricks : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.

Whatsapp Tricks : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే అనేక కొత్త ఫీచర్లు వాట్సాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల కన్నా ఎక్కువ మంది యూజర్లతో వాట్సాప్ ఒకటిగా నిలిచింది. ఈ యాప్ ద్వారా మీ ఫ్యామిలీ, స్నేహితులతో మెసేజ్‌లను పంపవచ్చు. వీడియో కాల్‌లు కూడా చేయవచ్చు.
ఫొటోలు/వీడియోలను షేర్ చేసుకోవచ్చు. అయితే మెసేజ్‌కి రిప్లయ్ ఇవ్వడానికి లేదా కాల్‌లు చేయడానికి టైప్ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్‌లో మీ చేతులతో టైప్ చేయకుండానే ఈజీగా మెసేజ్‌లు, కాల్స్ చేసుకోవచ్చు. మీరు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మీ రెండు చేతులతో వాట్సాప్ కాల్స్, మెసేజ్ చేయడానికి వీలుండదు. ఏదైనా వాట్సాప్ మెసేజ్‌కు రిప్లయ్ ఇవ్వడానికి మీ స్మార్ట్‌ఫోన్‌ను పట్టుకోలేరు. అయితే వాట్సాప్ ట్రిక్ ద్వారా ఈజీగా మెసేజ్, కాల్స్ చేసుకోవచ్చు.

Whatsapp Tricks : Whatsapp Messages How to send messages and make calls on WhatsApp
వాట్సాప్ కాల్‌లను ‘హ్యాండ్స్ ఫ్రీ’ చేసేందుకు యూజర్లను అనుమతించే WhatsApp ట్రిక్ ఒకటి అందుబాటులో ఉంది. ఈ ట్రిక్ చేయాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో వాయిస్ అసిస్టెంట్ తప్పనిసరిగా ఉండాలి. మీ డివైజ్ అన్‌లాక్ అయినప్పుడు మాత్రమే ఈ ట్రిక్ పనిచేస్తుందని గుర్తుంచుకోండి. మీ స్మార్ట్‌ఫోన్ లాక్ అయితే మాత్రం ఈ ట్రిక్ అసలే పనిచేయదు. ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎలా మెసేజ్, ఫోన్ కాల్స్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఆండ్రాయిడ్‌లో టైప్ చేయకుండా WhatsApp మెసేజ్ పంపాలంటే? :
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ని తీయకుండానే వాట్సాప్ మెసేజ్ పంపాలంటే.. అందులో Google అసిస్టెంట్‌ని ఎనేబుల్ చేయాలి. అలా చేయాలంటే.. సెట్టింగ్‌లకు వెళ్లి యాప్‌లపై Click చేయండి. కిందికి స్క్రోల్ చేసి, అసిస్టెంట్‌పై Tap చేయండి. ఆఫ్ చేస్తే టోగుల్‌ని ON చేయండి.
అసిస్టెంట్‌ని ఎనేబుల్ చేసేందుకు మీరు ‘Ok Google’ అని అనాల్సి ఉంటుంది. ఆ తర్వాత, మీ డివైజ్‌లో వాయిస్ అసిస్టెంట్‌ని యాక్సస్ చేయడానికి ‘Ok Google’ అని చెప్పండి. మీరు ఒక యూజర్ లేదా గ్రూప్ చాట్‌కి మెసేజ్ పంపమని Google అసిస్టెంట్‌ని అడగవచ్చు.
iOSలో టైప్ చేయకుండా WhatsApp మెసేజ్ ఎలా పంపాలంటే? :
మీ iPhoneలో Siriని ON చేయండి. అలా చేసేందుకు సెట్టింగ్‌లకు వెళ్లి, Siri & సెర్చ్‌పై Tap చేయండి. ఆపై ‘Hey Siri’ కోసం వినండి. ఆ తర్వాత టోగుల్‌ని ON చేయండి. ఇప్పుడు, యాప్‌లకు వెళ్లి.. వాట్సాప్‌ను సెర్చ్ చేయడానికి కిందికి స్క్రోల్ చేయండి.
దానిపై Tap చేసి ‘Use with Ask Siri’ అని చెప్పే టోగుల్‌ని ON చేయండి. ఆ తర్వాత, మీరు ఇప్పుడు మీ Apple iPhoneలో మెసేజ్‌లను వాయిస్ కమాండ్ ద్వారా పంపవచ్చు. వాట్సాప్ కాల్‌లను హ్యాండ్స్-ఫ్రీగా చేయవచ్చు. మీరు ‘Hey Siri Send Message’ అని చెప్పడం ద్వారా సులభంగా మీ మెసేజ్ పంపుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓసారి ట్రై చేయండి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..