వాట్సాప్‌లో కొత్త ఫీచర్ వస్తోంది.. స్టోరేజీ సెట్ చేసుకోవచ్చు!

  • Published By: sreehari ,Published On : September 30, 2020 / 04:59 PM IST
వాట్సాప్‌లో కొత్త ఫీచర్ వస్తోంది.. స్టోరేజీ సెట్ చేసుకోవచ్చు!

WhatsApp new storage UI  : ప్రముఖ ఇన్ స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న వాట్సాప్.. స్టోరేజీ ఆప్టిమైజేషన్ కోసం ఈ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. అదే.. New Storage UI ఫీచర్. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ Beta Users కోసం అందుబాటులోకి తీసుకొస్తోంది.



స్టోరేజీ మేనేజ్ మెంట్ కోసం స్టోరేజీ సెక్షన్ ను వాట్సాప్ అప్ డేట్ చేస్తోంది. అతి త్వరలో బీటా యూజర్లకు (WhatsApp beta users) ఈ కొత్త UI (యూజర్ ఇంటర్ ఫేస్) స్టోరేజీ ఫీచర్ అందుబాటులోకి రానుందని WABetainfo నివేదించింది. వాట్సాప్ బీటా ప్రొగ్రామ్ ద్వారా యూజర్లు ఈ బీటా వెర్షన్ నమోదు చేసుకోవచ్చు. కొత్త వాట్సాప్ బీటా అప్ డేట్ వెర్షన్ 2.20.201.9 ఫీచర్ అందుబాటులోకి రానుంది.



ప్రస్తుత వాట్సాప్ స్టోరేజీలో వ్యక్తిగత చాట్స్, వేర్వేరు మీడియా ఫైల్స్ స్టోరేజీ ఎంతవరకు ఉన్నాయో చెక్ చేసుకునే ఆప్షన్ మాత్రమే ఉంది. ఈ కొత్త స్టోరేజీ ఆప్షన్ ద్వారా యూజర్లు మోడ్రాన్ స్టోరేజీ బార్ కనిపిస్తుంది. మీడియా ఫైల్స్ ఎంత సైజులో ఉన్నాయో చూడొచ్చు. వాట్సాప్ మీడియా ఫైల్స్ సహా ఇతర ఫైల్స్ సైజు కూడా చూడొచ్చు. షేరింగ్ ఫైల్స్ సహా అన్ని ఫైళ్లను కొత్త, పాత లేదా సైజు (Newest, Oldest, or size) రివ్యూ చేసుకునేందుకు వాట్సాప్ అనుమతినిస్తుంది.

ఇందులో అనవసరమైన ఫైళ్లను డిలీట్ చేసుకోవచ్చు. ప్రత్యేకించి forwarded పైళ్ల కోసం ఒక కేటగిరీ ఉంటుంది. Large ఫైళ్ల కోసం మరో కేటగిరి ఉంటుంది. ఏదైనా ఒక చాట్ కోసం సెర్చ్ చేసేందుకు వీలుగా చివరి సెక్షన్‌లో Updated Storage Section అని కనిపిస్తుంది.



ఈ కొత్త స్టోరేజీ సెక్షన్ ద్వారా షేరింగ్ ఫైళ్లను షార్ట్ చేయడంతో పాటు స్టోరేజీని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. iOS యూజర్లు సహా రెగ్యులర్ వాట్సాప్ యూజర్లు కూడా ఈ కొత్త స్టోరేజీ UI ఫీచర్ అందుబాటులోకి వస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు.