WhatsApp : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. ఆండ్రాయిడ్‌లో బిగ్ ప్రైవసీ అప్‌డేట్.. చెక్ చేశారా?

WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ (Whatsapp) వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొచ్చింది. మీ ఆన్‌లైన్ స్టేటస్ చాట్‌లలో హైడ్ చేసుకోవచ్చు.

WhatsApp : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. ఆండ్రాయిడ్‌లో బిగ్ ప్రైవసీ అప్‌డేట్.. చెక్ చేశారా?

WhatsApp rolls out big privacy update for Android users

WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ (Whatsapp) వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొచ్చింది. మీ ఆన్‌లైన్ స్టేటస్ చాట్‌లలో హైడ్ చేసుకోవచ్చు. సిగ్నల్ యాప్‌లోనూ ఇదే రకమైన ప్రైవసీ ఫీచర్ అందుబాటలో ఉంది. స్క్రీన్‌షాట్ బ్లాకింగ్, ఇన్‌కాగింటో కీబోర్డ్ వంటి మరిన్ని ప్రైవసీ ఫీచర్‌లు WhatsAppలో అందుబాటులో లేవు. కానీ, యూజర్ల కోసం ప్రైవసీ మెరుగైన కంట్రోల్ అందించేందుకు మెసేజింగ్ యాప్ ఈ కొత్త ప్రైవసీ ఫీచర్లను అందిస్తోంది.

మీరు ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు మీ WhatsApp కాంటాక్టులను ఎవరూ చూడకూడదా? అయితే వాట్సాప్ సెట్టింగ్ సెక్షన్ ద్వారా హైడ్ చేయవచ్చు. మీ ఫ్రెండ్స్ ఆన్‌లైన్ స్టేటస్ ఫీచర్‌ను ఆఫ్ చేస్తే.. మీరు వారి ఆన్‌లైన్ స్టేటస్ కూడా చెక్ చేయలేరు. ఎందుకంటే లాస్ట్ సీన్ ఫీచర్ (Last Seen) ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇది కూడా అలానే పనిచేస్తుంది.

WhatsApp rolls out big privacy update for Android users

WhatsApp rolls out big privacy update for Android users

అదే సెక్షన్‌లో కొత్త అప్‌డేట్‌ను అందుకోవచ్చు. లేటెస్ట్ ప్రైవసీ అప్‌డేట్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోలేరు. యాప్‌లోని ప్రైవసీ సెక్షన్‌లో యూజరు మూడు ప్రైవీసీ ఆప్షన్లను (ఆన్‌లైన్, ప్రొఫైల్ ఫోటో, స్టేటస్) అందించింది. ఈ ఫీచర్ ద్వారా బ్లాక్ అయిన స్టేటస్ గుర్తించడం కష్టమేనని చెప్పవచ్చు.

వాట్సాప్ యూజర్లలో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో చెక్ చేసేందుకు ఆప్షన్ ఉంది. మీ చాట్‌లో రెండు చెక్ మార్కులను చూపిస్తే.. మీ మెసేజ్ డెలివరీ అయిందని అర్థం. మీరు బ్లాక్ కాలేదని తెలుసుకోవచ్చు. అయితే, యూజర్ ఇంటర్నెట్ ఆఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు వాట్సాప్ పని చేయదు. రిసీవర్‌కు మీ మెసేజ్ చేరదు.

పంపినవారి మొబైల్ డేటా ఆఫ్‌లో ఉన్నప్పుడు చాట్ చెక్ మార్క్‌ను మాత్రమే చూపిస్తుంది. యూజర్ మిమ్మల్ని బ్లాక్ చేయనట్లయితే.. రిసీవర్ ఇంటర్నెట్‌ను ఆన్ చేసినప్పుడు చాట్ రెండు చెక్ మార్క్‌లను చూపిస్తుంది. కొత్త వాట్సాప్ ఫీచర్ ఇప్పటికే లైవ్‌లో ఉంది. మీరు మీ ఆన్‌లైన్ స్టేటస్‌ను యూజర్ల నుంచి ఎలా హైడ్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

వాట్సాప్‌లో ఆన్‌లైన్ స్టేటస్ ఎలా హైడ్ చేయాలంటే?
* మీరు ముందుగా వాట్సాప్ యాప్‌ ఓపెన్ చేయండి.
* రైట్ టైప్ కార్నర్‌లో ఉంచిన త్రి డాట్స్ ఐకాన్ ట్యాప్ చేయండి.
* ఇప్పుడు, Settings > Account > Privacy Optionపై Tap చేయండి.
* మీరు ఇప్పుడు Last Seen, Online ఫీచర్‌ను చూడవచ్చు. ఇప్పుడు Nobody ఆప్షన్‌పై Tap చేయండి. ఆపై ఎవరూ ‘Same as last seen‘ ఆప్షన్ ఎంచుకోండి. మీరు “Nobody లేరు”పై Tap చేసి మీ ఆన్‌లైన్ స్టేటస్ అందరి నుంచి హైడ్ చేయవచ్చు. మీరు ‘My Contacts‘ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. ఆపై మీ Online Status మీ కాంటాక్టులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Accounts : మిలియన్ వాట్సాప్ అకౌంట్ల డేటా చోరీ.. చైనీస్ కంపెనీలపై మెటా దావా!