WhatsApp Voice Transcript : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసింది.. ఆ యూజర్లకు మాత్రమేనట..!

WhatsApp Voice Transcript : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసింది. ఎంపిక చేసిన యూజర్ల మాత్రమేనట.. వాయిస్ క్లిప్‌లను చదవడానికి యూజర్లను అనుమతిస్తుంది.

WhatsApp Voice Transcript : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసింది.. ఆ యూజర్లకు మాత్రమేనట..!

WhatsApp rolls out new voice transcript feature for select users, here are the details

WhatsApp Voice Transcript : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేసింది. మీ వాయిస్ క్లిప్‌లను చదవడానికి యూజర్లను అనుమతించనుంది. ఇప్పుడు యాప్ చాట్‌లలో షేర్ చేసిన మీ ఆడియో క్లిప్‌లను ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌క్రిప్షన్ చేస్తుంది. కానీ, వాట్సాప్ స్టేబుల్ వెర్షన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు. లేటెస్ట్ అప్‌డేట్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

వాట్సాప్ (WaBetaInfo) ద్వారా షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌లు వాయిస్ క్లిప్‌కు దిగువన కొత్త బాక్స్ యాడ్ చేసింది. మీరు ప్లే చేసిన సమయంలో ట్రాన్స్‌క్రిప్షన్ స్క్రీన్‌పై కనిపించడం ప్రారంభిస్తుంది. వర్క్ లేదా ఇతర విషయాలపై వాయిస్ మెసేజ్‌లను పంపుకోవచ్చు. వాట్సాప్ యూజర్లకు చాలా ఉపయోగకరమైన ఫీచర్ అవుతుంది.

వాయిస్ నోట్స్ కోసం ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ మెసేజ్‌లో నిర్దిష్ట సమాచారం కోసం సెర్చ్ చేసేందుకు కూడా అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌కు సపోర్టు అందిస్తుందని నివేదిక తెలిపింది. అంటే.. డేటా ఔట్ సర్వర్‌లకు ట్రాన్స్‌ఫర్ చేయలేరు.. ఆ డేటా ప్రైవేట్‌గా మాత్రమే ఉంటుంది.

Read Also : WhatsApp Chat Transfer : ఆండ్రాయిడ్ యూజర్లు త్వరలో వాట్సాప్‌‌ చాట్ ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు..!

ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్ ఎప్పుడు వస్తుందో కంపెనీ రివీల్ చేయలేదు. అయినప్పటికీ, ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ ఇప్పటికే ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్‌ను అందించింది. వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్‌కు వాట్సాప్ అవసరం లేదు. ఎందుకంటే.. ఇందులో లైవ్ క్యాప్షన్ ఫీచర్ ఉంది.

WhatsApp rolls out new voice transcript feature for select users, here are the details

WhatsApp rolls out new voice transcript feature for select users, here are the details

ఎవరైనా ఏదైనా వాల్యూమ్ బటన్‌ను నొక్కడం ద్వారా త్వరగా యాక్సెస్ చేయొచ్చు. ఈ బటన్ వాల్యూమ్ బార్‌లో చూడవచ్చు.సెర్చ్ బార్‌లో టైప్ చేయడం ద్వారా సెట్టింగ్‌లలో లైవ్ క్యాప్షన్ ఫీచర్‌ను పొందవచ్చు. మీరు ఈ ఫీచర్ ఓపెన్ తర్వాత, మీరు చేయాల్సిందల్లా వాయిస్ క్లిప్‌ను ప్లే చేయడమే.. ఆ తర్వాత మెసేజ్ ట్రాన్స్‌క్రిప్షన్ అవుతుంది. లిప్యంతరీకరించబడుతుంది.

వాయిస్ ట్రాన్స్‌క్రిప్ట్ ఫీచర్‌ను ఎలా డిసేబుల్ చేయాలంటే? :
వాట్సాప్‌లో వాయిస్ ట్రాన్స్‌క్రిప్ట్ ఫీచర్ డిఫాల్ట్‌గా ఉంటుంది. మీరు వాయిస్ మెసేజ్‌లను ట్రాన్స్‌క్రిప్ట్ చేయకూడదని భావిస్తే.. WhatsApp Settings >Chats> Voice Message Transcript విజిట్ చేయడం ద్వారా ఫీచర్‌ను నిలిపివేయవచ్చు.

కొత్త ఫీచర్ అందరికీ అందుబాటులో ఉందా? :
ఎంపిక చేసిన iOS బీటా టెస్టర్‌లకు మాత్రమే వాట్సాప్ లేటెస్ట్ అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. కానీ, లేటెస్ట్ iOS 16 OS వెర్షన్‌ని వాడే కొంతమంది యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ కనిపిస్తుందని గుర్తుంచుకోండి. బీటా యూజర్లు iOS 23.9.0.70 వెర్షన్ అప్‌డేట్‌లో ఫీచర్‌ను చూడవచ్చు. కొత్త ఫీచర్ రాబోయే వారాల్లో వాట్సాప్ యూజర్లు అందరికి అందుబాటులోకి రానుంది.

ఈ ఫీచర్ సరిగ్గా టెస్టింగ్ చేసిన తర్వాత పబ్లిక్ యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆంగ్ల భాషతో మాత్రమే పని చేస్తుంది. హిందీ వాయిస్ క్లిప్‌లను (Transcript) చేయలేమని గుర్తుంచుకోండి. రాబోయే కాలంలో ఇతర భాషలకు కూడా Transcript ఆప్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Read Also : Twitter Blue Tick Bug : ట్విట్టర్ కొంపముంచిన బగ్.. లెగసీ అకౌంట్లకు బ్లూ టిక్ తొలగిస్తే.. ఫ్రీగా తిరిగి ఇచ్చేసింది..!