WhatsApp Photo Quality : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో హైక్వాలిటీ ఫొటోలను ఈజీగా పంపుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

WhatsApp Photo Quality : ప్రముఖ మెసేజింగ్ యాప్ (Whatsapp) వాట్సాప్ ఎట్టకేలకు తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.

WhatsApp Photo Quality : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో హైక్వాలిటీ ఫొటోలను ఈజీగా పంపుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

WhatsApp rolls out photo quality feature, here’s how you can send high quality photos in Android and iOS

WhatsApp Photo Quality : ప్రముఖ మెసేజింగ్ యాప్ (Whatsapp) వాట్సాప్ ఎట్టకేలకు తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వాట్సాప్ యూజర్లు ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘Photo Quality’ ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది. ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్, iOS వినియోగదారులకు డేటాను సేవ్ చేసేందుకు ఒరిజినల్ క్వాలిటీలో లేదా కంప్రెస్డ్ ఫార్మాట్‌లో ఫొటోలను పంపే అవకాశాన్ని అందిస్తుంది.

వాట్సాప్ యూజర్లు తమ వాట్సాప్ సెట్టింగ్‌లను మార్చడం ద్వారా కొత్త ‘Photo Quality’ ఫీచర్‌ను యాక్సస్ చేసుకోవచ్చు. రాబోయే వారాల్లో వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ అందరికీ అందుబాటులో తీసుకురానుంది. మీరు మీ WhatsAppని అప్‌డేట్ చేయడం ద్వారా ఫీచర్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్‌ వాట్సాప్‌లో ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలను ఎలా పంపాలంటే?:
– WhatsApp యాప్‌ను ఓపెన్ చేయండి.
– ఇప్పుడు సెర్చ్ బార్ దగ్గర కుడి ఎగువ మూలలో అందుబాటులో ఉన్న మూడు చుక్కలపై ట్యాప్ చేసి సెట్టింగ్‌లకు వెళ్లండి.
– స్టోరేజ్, డేటాపై స్క్రోల్ చేసి ఆపై Tap చేయండి.
– ఆప్షన్‌ల కింద ‘Media Upload Quality’పై Tap చేయండి.
– మీరు మూడు ఆప్షన్ల నుంచి ఫొటో క్వాలిటీని ఎంచుకోవచ్చు. ‘Auto’, ‘Best Quality’ లేదా ‘Data Saver’ (డేటాను సేవ్ చేసేందుకు కంప్రెస్ ఫొటోను పంపండి).
ముఖ్యంగా, కంప్రెస్డ్ ఆప్షన్ మీ ఇంటర్నెట్ డేటాను సేవ్ చేస్తుంది. మీరు సెట్టింగ్‌లను మార్చడం ద్వారా ఎప్పుడైనా మీ ఫొటో అప్‌లోడ్ క్వాలిటీని మార్చవచ్చు.

ఐఫోన్‌లో వాట్సాప్‌లో ఒరిజినల్ క్వాలిటీతో ఫోటోలను ఎలా పంపాలి? :
– WhatsApp ఓపెన్ చేయండి.
– సెట్టింగ్‌ల ఐకాన్‌పై నొక్కండి.
– స్టోరేజీతో పాటు డేటాపై Tap చేయండి.
– స్క్రోల్ చేసి, ‘Media Upload Quality’పై Tap చేయండి.
– ఆటో, బెస్ట్ క్వాలిటీ లేదా డేటా సేవర్ మధ్య ఎంచుకోండి.
– ఆటోలో, డివైజ్ wi-fiకి కనెక్ట్ అయితే WhatsApp ఆటోమేటిక్‌గా హై క్వాలిటీతో ఫొటోలను పంపుతుంది.

Read Also : Whatsapp Tricks : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ట్రిక్.. టైప్ చేయకుండానే మెసేజ్, కాల్స్ చేసుకోవచ్చు తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

ఇదిలా ఉండగా, వాట్సాప్ యాప్‌లో ఉపయోగించిన స్టోరేజీని మేనేజ్ చేసుకునేందుకు కూడా వాట్సాప్ యూజర్లను అనుమతిస్తుంది. మీరు WhatsApp యాప్, మీడియాలో ఎంత మెమెరీ తీసుకుంటుందో చెక్ చేయవచ్చు. అవసరం లేని డేటాను డిలీట్ చేయడం ద్వారా స్టోరేజీని పెంచుకోవచ్చు.

WhatsApp rolls out photo quality feature, here’s how you can send high quality photos in Android and iOS

WhatsApp rolls out photo quality feature, here’s how you can send high quality photos

WhatsApp స్టోరేజీని చెక్ చేయాలంటే? :
– WhatsApp Chats Tab> More Options > Settings ఓపెన్ చేయండి.
– Next Tap > Storage And Data > Manage Storgage
– వాట్సాప్ మీ డివైజ్‌లో ఎంత స్టోరేజీని తీసుకుంటుందో చూడవచ్చు.

వాట్సాప్ స్టోరేజీని ఎలా ఫ్రీ చేయాలంటే? :
* మీడియాను డిలీట్ చేయడానికి స్టోరేజీని ఖాళీ చేయడానికి ఇలా చేయండి.
– చాట్స్ ట్యాబ్‌కి వెళ్లి, More Options > Settings బటన్ Tap చేయండి.
– Next Tap > Storage And Data > Manage Storage
– 5 MB కన్నా Forwarded many times Tap లేదా నిర్దిష్ట చాట్‌ని ఎంచుకోండి.

– ఇప్పుడు మీరు అన్ని అంశాలను ఒకేసారి డిలీట్ చేయడానికి ‘Select all’పై నొక్కడం ద్వారా అన్ని అంశాలను డిలీట్ చేయొచ్చు. మీరు మాన్యువల్‌గా ఒకేసారి ఒక మీడియాను డిలీట్ చేయవచ్చు. మీరు ఏదైనా మీడియాను డిలీట్ చేస్తే.. మీ WhatsApp మీడియా నుంచి డిలీట్ అవుతుంది. అలా డిలీట్ చేసిన మీడియా మీ డివైజ్‌లో సేవ్ అయి ఉంటుంది. మీరు డివైజ్ స్టోరేజీని ఖాళీ చేయాలనుకుంటే, మీ ఫోన్ స్టోరేజీ గ్యాలరీ నుంచి మీడియాను కూడా డిలీట్ చేయాలి.

Read Also : Aadhaar Mitra in India : భారత్‌లో ‘ఆధార్ మిత్ర’ కొత్త చాట్‌బాట్ వచ్చేసింది.. అదేంటి? ఎలా ఉపయోగించాలో తెలుసా? పూర్తి వివరాలు మీకోసం..!