WhatsApp Hide Status : ఇకపై వాట్సాప్ యూజర్లు ఆన్‌లైన్ స్టేటస్ ఇలా హైడ్ చేసుకోవచ్చు..!

WhatsApp Status : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. వాట్సాప్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను మరింత మెరుగుపరిచేందుకు ప్రైవసీని పటిష్టం చేసేందుకు WhatsApp ప్రతి నెలా కొత్త ఫీచర్‌లను ప్రకటిస్తోంది.

WhatsApp Hide Status : ఇకపై వాట్సాప్ యూజర్లు ఆన్‌లైన్ స్టేటస్ ఇలా హైడ్ చేసుకోవచ్చు..!

Starting this month, WhatsApp users will be able to hide their online status

WhatsApp Status : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. వాట్సాప్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను మరింత మెరుగుపరిచేందుకు ప్రైవసీని పటిష్టం చేసేందుకు WhatsApp ప్రతి నెలా కొత్త ఫీచర్‌లను ప్రకటిస్తోంది. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ స్క్రీన్‌షాట్‌ తీయకుండా నియంత్రించింది. ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ చేయడం (Hide Status), గ్రూపుల నుంచి నిశ్శబ్దంగా లెఫ్ట్ కావడం వంటి మూడు ప్రైవసీ ఫీచర్‌లను ప్రకటించింది. ఈ మూడు ఫీచర్లు డెవలప్‌మెంట్ చివరి దశలో ఉన్నాయని ఓ నివేదిక వెల్లడించింది. ఈ నెలాఖరు నాటికి వాట్సాప్ యూజర్లకు ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని కంపెనీ ధృవీకరించింది. వాట్సాప్ ఫీచర్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయనేది కచ్చితమైన డేట్ తెలియదు.

ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ చేయడం అనేది అనేక ఫీచర్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. దీని ద్వారా యూజర్లు తమ ఆన్‌లైన్ స్టేటస్‌ను ఎవరికి కనబడకుండా హైడ్ చేయవచ్చు. ఈ ఫీచర్ మొదట బీటా యూజర్లు iOS, Android కోసం అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత గ్లోబల్ రిలీజ్ కానుందని భావిస్తున్నారు. WaBetaInfo వెబ్‌సైట్ ప్రకారం.. ఈ ఫీచర్ వాట్సాప్ వెబ్ యూజర్లకు కూడా అందుబాటులోకి రాలేదు. వాట్సాప్‌ యూజర్లు తమ ఆన్ లైన్ స్టేటస్ తెలియకుండా ఉండేందుకు ఈ ఫీచర్ డెవలప్ చేస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నెలాఖరులో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ ధృవీకరించింది. వెబ్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి.

Starting this month, WhatsApp users will be able to hide their online status

Starting this month, WhatsApp users will be able to hide their online status

WhatsAppలో ఆన్‌లైన్ స్టేటస్ ఎలా హైడ్ చేయాలంటే? :
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. అసలు ఎలా పని చేస్తుందో వాట్సాప్ ఇప్పటికే వెల్లడించింది. మీ ఆన్‌లైన్ స్టేటస్ ఇతరులకు తెలియకుండా ఇలా హైడ్ చేసుకోవచ్చు.

– వాట్సాప్ ఓపెన్ చేస్తే చాలు
– Settingsకు వెళ్లండి.
– Accountకు వెళ్లండి
– Privacy Option
-Tap on the “Who can see when I’m online”
–Select from two options: “Everyone” and “Same as last seen”

– మీరు చివరిగా చూసిన Last Seen ఎంచుకుంటే చాలు.. మీరు చివరిగా చూసిన వాటిలో హడ్ అయిన అన్ని కాంటాక్టులు మీ ఆన్‌లైన్ స్టేటస్ చూడలేవు.

– మీ ఆన్‌లైన్ స్టేటస్ కావాలంటే, Last Seen సెక్షన్లో “No Body” ఆన్‌లైన్ స్టేటస్ పార్ట్‌లో “Same as last seen” ఎంచుకోండి.

ముఖ్యంగా, WhatsApp ఇప్పటికే యూజర్లు తమ స్టేటస్, ప్రొఫైల్ పిక్, చివరిగా చూసిన ప్రతి ఒక్కరి నుంచి లేదా ఆప్షన్ ఎంచుకున్న వ్యక్తుల నుంచి హైడ్ చేసేందుకు అనుమతిస్తుంది. ఇప్పుడు, మీరు ఆన్‌లైన్‌లో ప్రతి చాట్ పైనా “Online” స్టేటస్ ఫీచర్ హైడ్ అవుతుంది. మీరు యాప్‌ని ఉపయోగిస్తున్నారా లేదా ఆఫ్‌లైన్‌లో ఉన్నారా అనేది మీ కాంటాక్టు యూజర్లకు తెలిసే అవకాశం ఉంటుంది.

Read Also : WhatsApp Web : వాట్సాప్ వెబ్‌లోనూ ఇక వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.. కమింగ్ సూన్..!