WhatsApp: వాట్సప్ ప్రొఫైల్ పిక్ కనిపించకుండా హైడింగ్ ఆప్షన్

వాట్సప్ సెక్యూరిటీ ఫీచర్లలో మరో ఫెసిలిటీ రానుంది. ప్రొఫైల్ పిక్చర్ అందరికీ కనిపించకుండా కొందరికీ మాత్రమే కనిపించేలా ఫీచర్ రిలీజ్ రెడీ అవుతుంది.

WhatsApp: వాట్సప్ ప్రొఫైల్ పిక్ కనిపించకుండా హైడింగ్ ఆప్షన్

Whatsapp Will Stop Working On These Android Phones, Iphones By End Of 2021

WhatsApp: వాట్సప్ సెక్యూరిటీ ఫీచర్లలో మరో ఫెసిలిటీ రానుంది. ప్రొఫైల్ పిక్చర్ అందరికీ కనిపించకుండా కొందరికీ మాత్రమే కనిపించేలా ఫీచర్ రిలీజ్ రెడీ అవుతుంది. ఒకవేళ అది కుదరకపోతే ప్రొఫైల్ పిక్చర్ ఎవ్వరికీ కనిపించకుండానైనా అరేంజ్మెంట్ చేస్తారు. దీని కోసం ఆండ్రాయిడ్ 2.21.21.2 బీటా అప్ డేట్ రెడీగా ఉంది.

ఈ అరేంజ్మెంట్ కావాలంటే చేయాల్సిందల్లా.. ప్రైవసీ సెట్టింగ్స్ లో మార్పులు చేయడమే. వాట్సప్ స్టేటస్, ప్రొఫైల్ లాస్ట్ సీన్, అబౌట్ లతో పాటు వాట్సప్ ప్రొఫైల్ ఫొటో ప్రైవసీని తెరముందుకు తీసుకొచ్చారు. ఇతర సోషల్ మీడియా సిగ్నల్, టెలిగ్రామ్ ప్లాట్ ఫాంలకు దూరంగా వాట్సప్ టెక్నికల్ గా డెవలప్ అయ్యే పనిలో పడింది.

దీంతో పాటు ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ బ్యాకప్ ఫీచర్ కూడా సిద్ధం చేస్తుంది వాట్సప్. ఆండ్రాయిడ్, ఐఓఎస్ లలో ఒకేసారి టెస్ట్ చేస్తున్నారు. చాట్ హిస్టర్, మీడియాలపై అన్ ఆథరైజ్‌డ్ యాక్సెస్ కంట్రోల్ చేసే ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్ ఫాంలో గ్లోబల్ వాయీస్ మెసేజ్ ప్లేయర్, అడిషనల్ గా డిసప్పీయరింగ్ మెసేజ్ ఫీచర్ పైన టెస్టింగ్ జరుగుతుంది.

…………………………………………………..: నడుస్తున్న ప్రభాస్ జమానా.. వందలకోట్ల రెమ్యూనరేషన్?

రీసెంట్ గా వాట్సప్.. మల్టీ డివైజ్ సపోర్ట్ చేస్తుండగా ఒక ప్రైమరీ స్మార్ట్ ఫోన్ తో పాటు నాలుగు అడిషనల్ డివైజ్ లలోనూ సపోర్ట్ చేసే ఫీచర్ లాంచ్ అయింది.