WhatsApp: శాంసంగ్‌తోపాటు ఈ మోడల్ ఫోన్లలో జనవరి 1 నుంచి వాట్సాప్ సేవలు బంద్

జనవరి 1 నుంచి వాట్సాప్‌లో వచ్చే అప్‌డేట్స్, కొత్త ఫీచర్స్, సెక్యూరిటీ వంటివి ఈ 49 స్మార్ట్‌ఫోన్లకు రావని కంపెనీ తెలిపింది. వాట్సాప్ సంస్థ నిత్యం కొత్త ఫీచర్లను అందిస్తూ, సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇస్తూ యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తుంటుంది.

WhatsApp: శాంసంగ్‌తోపాటు ఈ మోడల్ ఫోన్లలో జనవరి 1 నుంచి వాట్సాప్ సేవలు బంద్

WhatsApp: జనవరి 1, 2023 నుంచి పలు స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్ని వాట్సాప్ సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ ప్రకటన ప్రకారం.. సెక్యూరిటీ లోపాలు, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వంటి పలు కారణాల వల్ల మొత్తం 49 రకాల స్మార్ట్‌ఫోన్లలో ఆదివారం నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.

Twitter: ఇంటి నుంచే టాయిలెట్ పేపర్స్ తెచ్చుకుంటున్న ట్విట్టర్ స్టాఫ్.. మస్క్ చర్యలతో ఉద్యోగుల తిప్పలు

జనవరి 1 నుంచి వాట్సాప్‌లో వచ్చే అప్‌డేట్స్, కొత్త ఫీచర్స్, సెక్యూరిటీ వంటివి ఈ 49 స్మార్ట్‌ఫోన్లకు రావని కంపెనీ తెలిపింది. వాట్సాప్ సంస్థ నిత్యం కొత్త ఫీచర్లను అందిస్తూ, సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇస్తూ యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తుంటుంది. అయితే, ఈ మార్పులకు అనుగుణంగా లేని స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ సేవల్ని సంస్థ నిలిపివేస్తుంది. వాట్సాప్ సేవలు ఆగిపోయే మొబైల్ ఫోన్లలో ఎక్కువగా పాత వెర్షన్ మొబైల్ ఫోన్లే ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లోని కోర్, ఎస్2, ఎస్3 మినీ, ట్రెండ్2, ట్రెండ్ లైట్, ఎక్స్ కవర్ 2, ఏస్2, ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ, హెచ్‌టీసీ డిజైర్, లెనోవా ఏ820, క్వాడ్ ఎక్స్ఎల్, సోనీ ఎక్స్‌పీరియా ఆర్క్ఎస్, ఎక్స్‌పీరియా మిరో, వికో సింక్ ఫైవ్ వంటి మోడల్స్ ఉన్నాయి.

Maharashtra: బీజేపీ నేతపై షిండే క్యాంపు నేతల దాడి.. షిండే వర్గం, బీజేపీ మధ్య ఇంకా కుదరని సయోధ్య

ఈ మోడల్ ఫోన్లు అన్నింటిలోనూ డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత నుంచి వాట్సాప్ పని చేయదు. ఈ ఫోన్లు వాడుతున్న వాళ్లు తిరిగి వాట్సాప్ సేవలు పొందాలంటే, వాట్సాప్ పని చేసే ఏ మొబైల్ ఫోన్‌కైనా మారాల్సి ఉంటుంది. వాట్సాప్ ఇప్పటికే యూజర్ల కోసం అనేక ఫీచర్లు అందబాటులోకి తెచ్చింది. త్వరలోనే స్టేటస్ అప్‌డేట్ రిపోర్ట్ అనే ఫీచర్ కూడా తీసుకురానుంది. అంటే ఎవరి వాట్సాప్ స్టేటస్ అయినా అభ్యంతరకరంగా ఉంటే, వాటిపై ఫిర్యాదు చేయొచ్చు.