యూజర్లకు వాట్సాప్‌ షాక్.. కొత్త టర్మ్స్ రిజెక్ట్ చేస్తే.. మెసేజ్‌లు ఆపేస్తోంది!

యూజర్లకు వాట్సాప్‌ షాక్.. కొత్త టర్మ్స్ రిజెక్ట్ చేస్తే.. మెసేజ్‌లు ఆపేస్తోంది!

WhatsApp to switch off messages reject new terms : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు షాక్ ఇచ్చింది. కొత్త ప్రైవసీ అప్‌డేటడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ రిజెక్ట్ చేసిన యూజర్ల మెసేజ్ లను ఆపేస్తోంది. ఎవరైతే యూజర్ మే 15 గడువు తేదీలోగా తమ టర్మ్స్ కండీషన్స్ యాక్సప్ట్ చేయారో వారికి మెసేజ్ రావు.. ఇతరులకు పంపలేరు.. యాక్సప్ట్ చేయని వాట్సాప్ యూజర్ల అకౌంట్ 120 రోజుల వరకు ఇన్ యాక్టివ్ స్టేటస్ లోకి వెళ్లిపోతుంది. అప్పటికి వారు యాక్సప్ట్ చేయకపోతే వారి అకౌంట్ పర్మినెంట్ గా డిలీట్ అయిపోతుందంట.

అయితే కాల్స్, నోటిఫికేషన్లు మాత్రం కొంత సమయం వరకు పనిచేస్తాయని అది కూడా కొన్నివారాల పాటు మాత్రమేనని టెక్ క్రంచ్ నివేదిక వెల్లడించింది. గత జనవరి 2021లో వాట్సాప్ కొత్త అప్ డేట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వాట్సాప్ ప్లాట్ ఫాంపై పేమెంట్స్ చేసుకునేందుకు వీలుగా యూజర్ల డేటాను యాక్సస్ చేసుకోనున్నట్టు ఇదివరకే వాట్సాప్ క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ యూజర్ల డేటాను పేరంట్ కంపెనీ ఫేస్ బుక్ కు షేర్ చేసేందుకేనంటూ చాలామంది యూజర్లు కొత్త అప్ డేట్ యాక్సప్ట్ చేసేందుకు నిరాకరిస్తున్నారు.

వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ అప్ డేట్ కు సంబంధించి సమాచారాన్ని ఇప్పటికే అందరి యూజర్లకు నోటిఫికేషన్ల ద్వారా షేర్ చేసింది. వాట్సాప్ ఈ తరహా అప్ డేట్ తీసుకురావడంతో వాట్సాప్ యూజర్లంతా ప్రత్యామ్నాయ యాప్ ల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే భారతీయ వాట్సాప్ యూజర్లు టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్ ల వైపు స్విచ్ కావడంతో సదరు యాప్ లకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది.