WhatsApp Trick : బ్లాక్ కలర్, ఫ్యాన్సీ ఫాంట్‌లతో వాట్సాప్ మెసేజ్ ఎలా పంపాలో తెలుసా? ఇదిగో సింపుల్ ట్రిక్స్..!

WhatsApp Trick : బ్లూ కలర్, డిఫరెంట్ ఫాన్సీ ఫాంట్‌లలో మెసేజ్‌లను పంపడానికి యూజర్లను అనుమతించే కొత్త థర్డ్ పార్టీ యాప్‌ని ప్రయత్నించవచ్చు. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

WhatsApp Trick : బ్లాక్ కలర్, ఫ్యాన్సీ ఫాంట్‌లతో వాట్సాప్ మెసేజ్ ఎలా పంపాలో తెలుసా? ఇదిగో సింపుల్ ట్రిక్స్..!

WhatsApp Trick _ How to send messages in blue colour and fancy fonts

WhatsApp Trick : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్.. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ తమ యూజర్ల కోసం అనేక సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వాట్సాప్ ద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కమ్యూనికేట్ చేసేందుకు బిలియన్ల మంది యూజర్లు ఉపయోగిస్తున్నారు. అదే ఫాంట్‌ని టెక్స్టింగ్‌కి ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్ ప్లాట్‌ఫారంపై బ్లూ కలర్, డిఫరెంట్ ఫాన్సీ ఫాంట్‌లలో మెసేజ్‌లను పంపడానికి అనుమతించే కొత్త థర్డ్ పార్టీ యాప్‌ని ప్రయత్నించవచ్చు.

 బ్లూ కలర్, ఫ్యాన్సీ ఫాంట్‌లలో మెసేజ్ ఎలా పంపాలో తెలుసా? :
* గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి, ‘స్టైలిష్ టెక్స్ట్ – ఫాంట్స్ కీబోర్డ్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి.
* డౌన్‌లోడ్ చేసిన తర్వాత యాప్‌ని ఓపెన్ చేసి స్క్రీన్ కిందిభాగంలో Tap చేయండి.
* Accept బటన్‌పై Tap చేయండి. బాటమ్ రైట్ కార్నర్‌లో కీబోర్డ్ సెక్షన్ ఓపెన్ చేయండి.

Note : ఈ థర్డ్ పార్టీ యాప్‌కు యాక్సెసిబిలిటీ పర్మిషన్ ఇవ్వొద్దు. లేదంటే.. యాప్ మీ డివైజ్‌పై పూర్తి కంట్రోల్ కలిగి ఉంటుంది. ఈ యాప్ సరిగ్గా పని చేయడానికి యాక్సెసిబిలిటీకి అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు. Agree బటన్‌పై Tap చేస్తే దానికి అనుమతి ఉండదు. మీరు యాప్ మెయిన్ విండోకు స్కిప్ అవుతుంది.

* ‘Enable Keyboard’పై Tap చేయండి. ‘Stylish Text Keyboard’ ఆప్షన్ ఎనేబుల్ చేయండి.

Read Also : Ola Electric Funding : ఈవీ స్కూటర్ మేకర్ ఫండ్ రైజింగ్ ప్లాన్.. రూ.2,500 కోట్ల నిధులు దక్కించుకున్న ఓలా..!

* యాక్టివేట్ బటన్‌పై మళ్లీ Tap చేయండి.
* WhatsApp ఓపెన్ చేయండి > ఏదైనా చాట్ ఓపెన్ చేయండి > వాట్సాప్ టెక్స్ట్‌ని టైప్ చేసే మెసేజ్ బార్‌పై Tap చేయండి.
* కీబోర్డ్ కిందిభాగంలో కీబోర్డ్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై Tap చేయండి. స్టైలిష్ టెక్స్ట్ కీబోర్డ్‌కు మారండి.

WhatsApp Trick _ How to send messages in blue colour and fancy fonts

WhatsApp Trick _ How to send messages in blue colour and fancy fonts

* ఇప్పుడు మీరు కీబోర్డ్ పైన స్టైలిష్ ఫాంట్‌లను చూడవచ్చు.
* మీరు బ్లూ కలర్ మెసేజ్‌లను పంపాలనుకుంటే… వివిధ ఫాంట్ స్టయిల్ కనిపించే కీబోర్డ్‌లో ఎడమవైపు ఉన్న స్లయిడ్‌పై Tap చేయండి.
* అప్పుడు బ్లూ కలర్ ఫాంట్‌ను చూడవచ్చు. అందుకు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయండి.
* బ్లూ కలర్ టెక్స్ట్ మెసేజ్ లను పంపుకోవచ్చు.

Note : మీకు ఫ్యాన్సీ ఫాంట్ లేదా బ్లూ కలర్ టెక్స్ట్ వద్దు అనుకుంటే.. అప్పుడు మీరు కీబోర్డ్‌లో ‘Normal’ ఫాంట్‌ని ఎంచుకోవచ్చు. పైన పేర్కొన్న విధంగానే కొత్త కీబోర్డ్‌కి మారవచ్చు.

ఇవి తప్పక గుర్తుంచుకోవాలి :
ఈ యాప్ థర్డ్-పార్టీ యాప్.. ఎవరైనా తమ ఓన్ రిస్క్‌తో దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ప్రస్తుతం చాలా సురక్షితమైనదిగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ యాప్ వర్క్ చేయడానికి ఎలాంటి పర్మిషన్ అడగదు. ఇలా ఉంటేనే యాప్ వాడాలి. ఈ యాప్ వర్కింగ్ గురించి డేటాను సేకరిస్తుంది. ఈ యాప్ క్రాష్ అవుతుందా లేదా యూజర్లకు సురక్షితమైన అనుభవాన్ని అందిస్తోంది.

Read Also : Reliance JioMart Layoffs : కోత మొదలైంది.. జియోమార్ట్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు.. మరో 9వేల జాబ్స్ తగ్గించే అవకాశం..!