మీ ఫోన్‌లో వాట్సాప్ పనిచేయదంట.. ఈ తేదీలోగా యాక్సప్ట్ చేయండి..!

మీ ఫోన్‌లో వాట్సాప్ పనిచేయదంట.. ఈ తేదీలోగా యాక్సప్ట్ చేయండి..!

WhatsApp updates Terms of Service : ప్రముఖ పాపులర్ మెసేంజర్ యాప్ వాట్సాప్ కొత్త అప్ డేట్ తీసుకొస్తోంది. అతి త్వరలో కొత్త రూల్స్ ప్రవేశపెట్టబోతోంది. టర్మ్స్ ఆఫ్ సర్వీసు, ప్రైవసీ పాలసీలను తీసుకొస్తోంది. ఈ కొత్త ప్రైవసీ రూల్స్ వాట్సాప్ యూజర్లంతా యాక్సప్ట్ చేయాలంట.. లేదంటే యాప్ యాక్సస్ చేసుకోలేరని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

దీనికి సంబంధించి ఫేస్ బుక్ సొంత మెసేజింగ్ యాప్ ప్రపంచవ్యాప్తంగా తమ వాట్సాప్ యూజర్లకు నోటిఫికేషన్లు పంపుతోంది. టర్మ్స్ ఆఫ్ సర్వీసు, ప్రైవసీ పాలసీలను మార్చేస్తున్నట్టు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల అందరికి నోటిఫికేషన్ల ద్వారా తెలియజేస్తోంది.

ఈ కొత్త నిబంధ‌న‌ల‌కు ఫిబ్ర‌వ‌రి 8లోగా అంగీక‌రించ‌క‌పోతే వాట్సాప్ ప‌ని చేయ‌దంట.. ఈ నోటిఫికేష‌న్ల‌పై క్లిక్ చేస్తే.. వాట్సాప్ యూజ‌ర్ల డేటాను ఎలా సేక‌రిస్తోంది.. ప్రాసెసింగ్ వంటి వివరాలు కనిపిస్తున్నాయంట. మీరు వాట్సాప్‌ను ఇన్‌స్టాల్‌, యాక్సెస్ లేదా సర్వీసులను వాడితే వాట్సాప్ క‌చ్చితంగా మీ స‌మాచారాన్ని సేక‌రిస్తుంద‌ని పాల‌సీ విధానంలో వాట్సాప్ పేర్కొంది. ఈ కొత్త రూల్స్, ప్రైవ‌సీ పాల‌సీ ఫిబ్ర‌వ‌రి 8 నుంచి అమల్లోకి రానున్నాయి.