Whatsapp UPI Payments : మీ ఫోన్‌లో GPay, PhonePe పనిచేయడం లేదా? వాట్సాప్ ద్వారా నగదు ఇలా ఈజీగా పంపుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

Whatsapp UPI Payments : యూపీఐ వినియోగదారులకు అలర్ట్.. మీరు గూగుల్ పే (Google Pay), పోన్‌పే (PhonePe) ద్వారా పేమెంట్లు చేయలేకపోతున్నారా? అయితే ఆందోళన అక్కర్లేదు.

Whatsapp UPI Payments : మీ ఫోన్‌లో GPay, PhonePe పనిచేయడం లేదా? వాట్సాప్ ద్వారా నగదు ఇలా ఈజీగా పంపుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

Google Pay or PhonePe not working_ here is how to send money using WhatsApp

Whatsapp UPI Payments : యూపీఐ వినియోగదారులకు అలర్ట్.. మీరు గూగుల్ పే (Google Pay), పోన్‌పే (PhonePe) ద్వారా పేమెంట్లు చేయలేకపోతున్నారా? అయితే ఆందోళన అక్కర్లేదు. మీకోసం వాట్సాప్ యూపీఐ పేమెంట్స్ (Whatsapp UPI Services) సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అనేది చిన్న లేదా పెద్ద లావాదేవీలతో నగదు బదిలీ చేసుకోవచ్చు. రో

డ్డు పక్కన చిరు వ్యాపారుల నుంచి కూరగాయలు కొనడంతో పాటు విద్యుత్ బిల్లులు (Power Bills) చెల్లించడం లేదా ప్రయాణ టిక్కెట్లు బుక్ చేసుకోవడం వరకు అన్ని యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. యూపీఐ (UPI) ద్వారా నగదు లేదా కార్డులతో అవసరం లేకుండానే పేమెంట్లు చేసుకోవచ్చు. Google Pay, PhonePe, Paytm వంటి UPI యాప్స్ ద్వారా సులభంగా నగదు బదిలీ చేసుకోవచ్చు. నెలవారీ పేమెంట్లను ట్రాక్ చేయడం వంటి అనేక ఇతర ఫీచర్‌లను కూడా యాక్సస్ చేసుకోవచ్చు.

ఈ సాంప్రదాయ యాప్‌లతో సర్వర్ డౌన్ కారణంగా మీరు మొబైల్ డేటాలో పేమెంట్లు చేయలేకపోతున్నారా? మీరు UPI పేమెంట్లు చేసుకునేందుకు మరో యాప్ అందుబాటులో ఉంది. వాట్సాప్ డౌన్‌లోడ్ చేయకుండానే మీ మొబైల్ ఫోన్‌లో ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసి ఉందని గుర్తించాలి.

WhatsApp పేమెంట్లు అనే WhatsApp UPI ట్రాన్సాక్షన్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. WhatsApp UPI పేమెంట్ ఫీచర్ కొన్ని నెలల క్రితమే అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులు మెసేజ్ పంపే సౌలభ్యంతో పాటు నగదును కూడా బదిలీ చేసేందుకు అనుమతిస్తుంది. మీరు యాప్‌ను డౌన్‌లోడ్ చేయకుండానే మొబైల్ నంబర్‌కి లేదా QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా సులభంగా నగదు పంపవచ్చు. వాట్సాప్ చాట్ ఇంటర్‌ఫేస్ విండోలో పేమెంట్లను ఎలా సెటప్ చేయాలో ఇప్పుడు చూద్దాం..

Google Pay or PhonePe not working_ here is how to send money using WhatsApp

Google Pay or PhonePe not working_ here is how to send money using WhatsApp

Read Also : WhatsApp New Scam : వాట్సాప్‌లో కొత్త సైబర్ స్కామ్.. ఏకంగా రూ. 57 కోట్లు కోల్పోయిన యూజర్లు.. ఇలా చేస్తే.. సైబర్ మోసాల నుంచి సేఫ్‌గా ఉండొచ్చు!

WhatsApp పేమెంట్స్ ఎలా సెటప్ చేసుకోవాలంటే? :

* మీ Android లేదా iOS స్మార్ట్‌ఫోన్‌లో WhatsApp యాప్‌ని ఓపెన్ చేయండి.
* ఇప్పుడు మీరు నగదు బదిలీ చేయాలనుకుంటున్న యూజర్ చాట్‌ను ఓపెన్ చేయండి.
* మీరు టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న త్రి డాట్స్‌పై Tap చేయడం ద్వారా పేమెంట్లపై నేరుగా Tap చేయవచ్చు.
* ఇప్పుడు ‘Add your payment method’పై Tap చేయండి.
* ఆపై ‘Add bank account‘పై Click చేయండి.
* మీకు Savings Account ఉన్న బ్యాంక్‌ను ఎంచుకోండి.
* ఆ తర్వాత, మీరు మీ ఫోన్ నంబర్‌ను ధృవీకరించాలి.
* ముఖ్యంగా, మీ ఫోన్‌లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉండాలి.
* మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను కలిగి ఉంటే.. వాట్సాప్ దాన్ని ఆటోమాటిక్‌గా ధృవీకరిస్తుంది.
* ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను యాడ్ చేయండి.
* రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా నగదు పంపడం లేదా స్వీకరించడానికి WhatsAppని అనుమతించండి.
* Continueపై క్లిక్ చేయండి. ఇప్పుడు, మీ బ్యాంక్ WhatsApp ద్వారా UPI పేమెంట్లను ప్రాసెస్ చేసుకోవచ్చు.

WhatsApp UPI పేమెంట్స్ ద్వారా నగదు పంపడం ఎలా :

* మీరు నగదు పంపాలనుకుంటున్న కాంటాక్ట్ చాట్‌ని ఓపెన్ చేయండి లేదా త్రీ-డాట్ బటన్ నుంచి నేరుగా Payments ఓపెన్ చేయండి.
* నంబర్ లేదా QR కోడ్‌ని ఉపయోగించి Payments ఎంచుకోండి.
* ఇప్పుడు మీరు పంపాలనుకుంటున్న మొత్తాన్ని Enter చేయండి.
* రిజిస్టర్డ్ బ్యాంక్ కోసం మీ UPI PIN సెట్‌ను నమోదు చేసి Send paymentపై Click చేయండి.

మీరు చాట్‌లోనే మీ Payment Status కూడా చెక్ చేయవచ్చు. మీరు చాట్‌లోని లావాదేవీలను కూడా ట్రాక్ చేయవచ్చు. WhatsApp పేమెంట్లను చేయడానికి అనేక రకాల స్టిక్కర్లు కూడా అందిస్తుంది. ఈ స్టిక్కర్లు, బ్యాక్‌డ్రాప్‌లను యాడ్ చేసేందుకు ‘Sticker’ ఐకాన్‌పై Tap చేయండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Tricks & Tips : 2022లో ఉపయోగకరమైన 5 వాట్సాప్‌ టిప్స్ అండ్ ట్రిక్స్.. ఏయే ఫీచర్లు ఎలా పనిచేస్తాయంటే?