WhatsApp Video Messages : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. త్వరలో వీడియో మెసేజ్‌లను కూడా పంపుకోవచ్చు..!

WhatsApp Video Messages : వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ రాబోతోంది. ఇప్పటివరకూ ఆడియో మెసేజ్‌ (Whatsapp Audio Messages) లను మాత్రమే పంపుకునే వీలుంది. త్వరలో వీడియో మెసేజ్‌లను కూడా పంపుకోవచ్చు.

WhatsApp Video Messages : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. త్వరలో వీడియో మెసేజ్‌లను కూడా పంపుకోవచ్చు..!

WhatsApp users may be able to send video messages in the future, report says

WhatsApp Video Messages : మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్.. భవిష్యత్తులో వీడియో మెసేజ్‌ (Whatsapp Video Messages)లను పంపడానికి యూజర్లను అనుమతించనుంది. ఈ మేరకు వాట్సాప్ సరికొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. (WaBetaInfo) నివేదిక ప్రకారం.. వాట్సాప్‌లో యూజర్లు తమ కాంటాక్టులతో 60 సెకన్ల వరకు షార్ట్ వీడియోలను రికార్డ్ చేయొచ్చు. ఆ తర్వాత వీడియోలను షేర్ చేయొచ్చు.

వాట్సాప్ యూజర్ వీడియో మెసేజ్ స్వీకరించినప్పుడల్లా చాట్ లిస్టులో ‘Video Message’ కనిపిస్తుందని నివేదిక పేర్కొంది. వాట్సాప్ ద్వారా వీడియోలను షేర్ చేసేందుకు ప్రస్తుతం ఉన్న ఫీచర్ కన్నా కొత్త ఫీచర్ భిన్నంగా ఉంటుందని గమనించాలి. రెండు వాట్సాప్ ఫీచర్ల మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే.. రాబోయే వీడియో మెసేజ్ ఫీచర్‌తో యూజర్లు రియల్ టైమ్‌లో వీడియోలను రికార్డ్ చేయవచ్చు.

Read Also : Mi Band 8 Launch : ఏప్రిల్ 18న షావోమీ MI బ్యాండ్ 8, షావోమీ 13 Ultra ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే?

‘వాట్సాప్ పంపిన వీడియో మెసేజ్ స్వీకరించినప్పుడు.. అక్కడికక్కడే రికార్డ్ అయిందని చెప్పవచ్చు. తద్వారా వీడియో అథెంటికేషన్ కూడా నిర్ధారిస్తుందని నివేదిక పేర్కొంది. అదనంగా, వాట్సాప్‌లోని వీడియో మెసేజ్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతాయి. అంటే.. వాట్సాప్ కూడా వాటిని చదవదు.

WhatsApp users may be able to send video messages in the future, report says

WhatsApp users may be able to send video messages in the future

వీడియో మెసేజ్‌లను సేవ్ చేయడం లేదా ఫార్వార్డ్ చేయడం సాధ్యం కాదు. అయితే, వీడియోలను స్క్రీన్ రికార్డింగ్ ఫీచర్‌ని ఉపయోగించి ఇప్పటికీ రికార్డ్ చేయవచ్చు. కానీ, వ్యూ వన్స్ మోడ్ (View Once) మోడ్ ద్వారా పంపిన వీడియోలకు పనిచేయదు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ వర్కింగ్ స్టేజ్‌లో ఉంది.

టెస్ట్‌ఫ్లైట్‌లో (iOS 23.7.0.77) అప్‌డేట్ లేటెస్ట్ వాట్సాప్ బీటాలో (waBetaInfo)లో ఉందని నివేదిక తెలిపింది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ యూజర్‌లు తమ స్టేటస్ అప్‌డేట్‌లను వాట్సాప్‌ను వదలకుండా ఫేస్‌బుక్ స్టోరీలకు షేర్ చేసేందుకు అనుమతిస్తుంది. ఫేస్‌బుక్ స్టోరీకి స్టేటస్ అప్‌డేట్ షేర్ చేసే విధానాన్ని మెరుగుపరుస్తుందని నివేదిక పేర్కొంది.

వాట్సాప్ యూజర్లు తమ స్టేటస్ అప్‌డేట్‌లపై ఎల్లప్పుడూ కంట్రోల్ కలిగి ఉంటారని, ఏ స్టేటస్ అప్‌డేట్‌లను షేర్ చేయాలో యూజర్లు నిర్ణయించుకోవచ్చని నివేదిక పేర్కొంది. వాట్సాప్ నుంచి నిష్క్రమించకుండానే ఫేస్‌బుక్ స్టోరీలకు స్టేటస్ అప్‌డేట్ షేర్ చేసుకునే వీలుంది. అయితే, ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆఫ్‌లో ఉంటుంది. వాట్సాప్ యూజర్లు తమ ఫీచర్‌ వినియోగించాలంటే.. తమ స్టేటస్ ప్రైవసీ సెట్టింగ్‌లకు వెళ్లవచ్చు. ఈ ఫీచర్‌ని ఎప్పుడైనా డిజేబుల్ చేసుకునే వీలుంది.

Read Also : Skoda SUV Models : స్కోడా నుంచి రెండు సరికొత్త మోడల్ కార్లు.. అద్భుతమైన ఫీచర్లు, కొత్త ఎడిషన్ల ధర ఎంతంటే?