WhatsApp Verification Feature : వాట్సాప్‌లో కొత్త వెరిఫికేషన్ ఫీచర్ వస్తోంది.. మీ అకౌంట్ ఎవరూ యాక్సెస్ చేసినా మీకు ఇట్టే తెలిసిపోతుంది..!

WhatsApp Verification Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp)లో సరికొత్త ఫీచర్ రాబోతోంది. వాట్సాప్ కొత్త డివైజ్‌లను లాగిన్ చేస్తున్నప్పుడు మెరుగైన సెక్యూరిటీ అందించేందుకు కొత్త వెరిఫికేషన్ ఫీచర్‌పై పనిచేస్తోంది.

WhatsApp Verification Feature : వాట్సాప్‌లో కొత్త వెరిఫికేషన్ ఫీచర్ వస్తోంది.. మీ అకౌంట్ ఎవరూ యాక్సెస్ చేసినా మీకు ఇట్టే తెలిసిపోతుంది..!

WhatsApp Verification Feature _ WhatsApp could soon launch a new verification feature for set up process

WhatsApp Verification Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp)లో సరికొత్త ఫీచర్ రాబోతోంది. వాట్సాప్ కొత్త డివైజ్‌లను లాగిన్ చేస్తున్నప్పుడు మెరుగైన సెక్యూరిటీ అందించేందుకు కొత్త వెరిఫికేషన్ ఫీచర్‌పై పనిచేస్తోంది. అదే.. వాట్సాప్ వెరిఫికేషన్ ఫీచర్ (WhatsApp Verification Feature). ప్రస్తుతానికి WabetaInfo బీటా వెర్షన్‌లో ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. దానికి సంబంధించి స్క్రీన్‌షాట్‌లను కూడా కంపెనీ షేర్ చేసింది. ఇకపై వాట్సాప్ యూజర్లు కొత్త డివైజ్‌లో WhatsAppని సెటప్ చేసేందుకు ప్రయత్నిస్తే.. కొత్త వెరిఫికేషన్ ఫీచర్‌ కనిపిస్తుంది.

అప్పుడు, మీకు యాప్‌లో 6-అంకెల కోడ్‌ను చూపిస్తుంది. సాధారణంగా, వాట్సాప్ యూజర్లు అనుకోకుండా వెరిఫికేషన్ కోడ్‌ను రాంగ్ యూజర్లతో షేర్ చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో వాట్సాప్ యూజర్లు తమ యాప్‌లో వెరిఫికేషన్ కోడ్‌ను పొందవచ్చు. తద్వారా ఆ కోడ్ ప్రైమరీ డివైజ్‌కు సెండ్ అవుతుంది. ఎవరైనా మీ డివైజ్ యాక్సెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లయితే.. యాప్ మీ స్క్రీన్‌కి కోడ్‌ని పంపుతుంది. అప్పుడు మీరు వెంటనే అలర్ట్ కావొచ్చు.

స్క్రీన్‌షాట్‌ ప్రకారం.. యాప్ ప్రధాన పేజీలో వెరిఫికేషన్ కోడ్ కనిపిస్తుంది. మీరు ఎవరితోనైనా చాట్ చేస్తున్నప్పటికీ.. యాప్ కొత్త వెరిఫికేషన్ కోడ్‌ని పంపుతుంది. వాస్తవానికి ఈ కొత్త ఫీచర్ ఎప్పుడు వచ్చేది అనేది వాట్సాప్ ఇంకా వెరిఫై చేయలేదు. మెసేజింగ్ యాప్ లేటెస్ట్ Android 2.23.1.11 బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

WhatsApp Verification Feature _ WhatsApp could soon launch a new verification feature for set up process

WhatsApp Verification Feature _ WhatsApp could soon launch a new verification feature for set up process

Read Also : WhatsApp Tricks & Tips : 2022లో ఉపయోగకరమైన 5 వాట్సాప్‌ టిప్స్ అండ్ ట్రిక్స్.. ఏయే ఫీచర్లు ఎలా పనిచేస్తాయంటే?

స్టేబుల్ వెర్షన్ ఫీచర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ప్రస్తుతం తెలియదు. కానీ, ముఖ్యమైన ఫీచర్ అయినందున కంపెనీ దానిని బయటకు చాలా సమయం పడుతుందని భావించడం లేదు. iOSలో కూడా వస్తుందా లేదా అనేది వివరాలు లేవు. WhatsApp ఫస్ట్ iOS వెర్షన్‌లో టెస్టింగ్ చేసిన తర్వాత ఆపై రెండు ప్లాట్‌ఫారమ్‌లలో ఒకేసారి ఫీచర్‌ను లాంచ్ చేయాలని భావిస్తోంది.

WhatsApp రూపొందించిన ఇతర కొత్త ఫీచర్‌లను ప్రయత్నించవచ్చు. యాప్ ఇప్పుడు పోల్‌లను క్రియేట్ చేసే ఆప్షన్ అందిస్తుంది. యాప్‌లో వారి ఆన్‌లైన్ స్టేటస్ కూడా హైడ్ చేయవచ్చు. వాట్సాప్‌లో పెద్ద కమ్యూనిటీని క్రియేట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. వాట్సాప్ ఆటోమాటిక్‌‌గా డేటాను సేవ్ చేస్తుంది. వాట్సాప్ యూజర్లు పొడవైన వాయిస్ మెసేజ్‌లను రికార్డ్ చేయవచ్చు లేదా సగంలో వదిలివేయవచ్చు.

మీరు ఎప్పుడైనా మెసేజ్ రికార్డ్ చేయవచ్చు. వాట్సాప్ ‘Delete For Me’ మెసేజ్‌లను Undo చేసే సామర్థ్యాన్ని కూడా యాడ్ చేసింది. మీరు ఏదైనా తప్పుగా మెసేజ్ పంపితే వెంటనే Undo చేయవచ్చు. వాట్సాప్ Undo బటన్‌ నొక్కడం ద్వారా ఐదు-సెకన్ల లోపు ఒక విండో కనిపిస్తుంది. దానిపై ‘delete for everyone’ బటన్‌ను Tap చేయడం ద్వారా మీరు అసలు మెసేజ్ వెంటనే డిలీట్ చేయవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Whatsapp UPI Payments : మీ ఫోన్‌లో GPay, PhonePe పనిచేయడం లేదా? వాట్సాప్ ద్వారా నగదు ఇలా ఈజీగా పంపుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!