వాట్సాప్‌లో Chat ఓపెన్ చేయకుండానే మెసేజ్‌లు చదవచ్చు.. మీరూ ట్రై చేయండి!

  • Published By: sreehari ,Published On : October 3, 2020 / 03:32 PM IST
వాట్సాప్‌లో Chat ఓపెన్ చేయకుండానే మెసేజ్‌లు చదవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Whatsapp Web Chat : మీరు వాట్సాప్ వాడుతున్నారా? వాట్సాప్‌లో చాట్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ ఎలా చదవాలో తెలుసా? అయితే ఈ వార్త మీకోసమే.. వాట్సాప్ చాట్ ఓపెన్ చేయాల్సిన పనిలేకుండానే వచ్చిన మెసేజ్‌లు అలానే చదివేయచ్చు. సాధారణంగా వాట్సాప్ చాట్ లో ఏదైనా మెసేజ్ వస్తే.. దాన్ని ఓపెన్ చేస్తే తప్పా పూర్తి మెసేజ్ చదవడానికి వీలులేదు.



మీరు మెసేజ్ చదివారు అనే విషయం పంపిన వ్యక్తికి తెలియకుండా చేయొచ్చు.. చాట్ బాక్స్ తెరవకుండానే వాట్సాప్ మెసేజ్‌లు చూసేందుకు కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి అవేంటో ఓసారి చూద్దాం.. మీ స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ మెసేజ్ రాగానే వెంటనే మీకు నోటిఫికేషన్ ప్యానల్ వద్ద మెసేజ్ పాప్ అప్ కనిపిస్తుంది.

ఒకవేళ మీరు మెసేజ్ డిలీట్ చేసినా కూడా నోటిఫికేషన్ ప్యానల్ పై చూడొచ్చు.. ఒకవేళ నోటిఫికేషన్ ప్యానల్ పై వాట్సాప్ మెసేజ్ మిస్ అయితే ఎలా చదవడం అనే కదా మీ డౌట్.. నోటిఫికేషన్ ప్యానల్ పై మెసేజ్ రాకపోయినా వాట్సాప్ చాట్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ చదవచ్చు..



Whatspp Widget ద్వారా చాట్ మెసేజ్ లను చదవచ్చు.. మీరు చేయాల్సిందిల్లా.. మీ ఫోన్ హోం స్ర్కీన్ పై long-press చేయాల్సి ఉంటుంది. Widgets ఆప్షన్ కనిపిస్తుంది.. దానిపై Tap చేయండి. మీకు అక్కడ చాలా Shortcuts కనిపిస్తాయి. Whatsapp Widget కోసం కొంచెం కిందివరకు Scroll down చేయండి.



వాట్సాప్ Widget కనిపించగానే దానిపై లాంగ్ ప్రెస్ చేసి.. ఇతర యాప్స్ పక్కనే మరో స్ర్కీన్‌పై డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి.. ఒకవేళ వాట్సాప్ డిలీట్ చేసిన మెసేజ్ లు చెక్ చేయాలంటే Google Play Store నుంచి ఒక Third-party app డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ Android version మెసేజింగ్ యాప్ యూజర్లు Whatsapp Webలో చాట్ ఓపెన్ చేయకుండానే messages చెక్ చేసుకోవచ్చు.. మెసేజ్ పంపినవారికి కూడా మీరు ఆ మెసేజ్ చదివిన విషయం తెలియకుండా చేయొచ్చు. అదేలానో చూద్దాం..



* Whatsapp Web ఓపెన్ చేయండి.
* మొబైల్ యాప్ నుంచి QR code ద్వారా Scan చేసి Login అవ్వండి.
* Whatsapp Webలో ఏదైనా మెసేజ్ వస్తే.. మీ Mouse Cursor దానిపై ఉంచండి చాలు..
* మౌజ్ కర్సర్ టచ్ చేస్తే చాలు.. వచ్చిన మెసేజ్ ఫుల్‌గా చూడొచ్చు.. ఓపెన్ చేయాల్సిన పనిలేదు.
* వాట్సాప్ Web version అన్ని మెసేజ్ లను ఇలానే చెక్ చేసుకోవచ్చు.