వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్

వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్

Whatsapp Web Video And Voice Call Feature : ప్రముఖ మెసేజింగ్ వాట్సాప్‌ కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో కొత్త ఫీచర్ వస్తోంది. అతి త్వరలో వీడియో/వాయిస్ కాల్ ఫీచర్ ప్రవేశపెట్టబోతోంది. వాట్సాప్ తన అధికారిక బ్లాగ్‌లో ప్రకటించింది.

ప్రస్తుతానికి ఈ ఫీచర్ వెబ్ వెర్షన్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. బీటా వెర్షన్ కారణంగా కొంత మంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సంస్థ తెలిపింది.

రాబోయే రోజుల్లో మిగతా వాట్సాప్ వెబ్ వెర్షన్ యూజర్లందరికి అందుబాటులోకి తీసుకురానుంది. మొబైల్‌లో మాదిరిగానే వాయిస్, వీడియో కాల్ బటన్ చాట్ హెడర్‌లో ఉంటుందని చూపించే కొన్ని స్క్రీన్‌షాట్‌లను తన అధికారిక బ్లాగ్ లో షేర్ చేసింది.

వాట్సాప్ వెబ్ నుంచి ఏదైనా కాల్ వస్తే.. మీకు స్క్రీన్ మీద స్పెషల్ విండో pop-up వస్తుంది. లిఫ్ట్ చేయొచ్చు లేదా రిజక్ట్ చేయొచ్చు. ఎవరైనా కాల్ చేస్తే ఒక చిన్న పాపప్ మెసేజ్ స్క్రీన్ మీద వస్తుంది.

కాల్ చేసిన ప్రతిసారి వీడియో కాల్‌ల మాదిరిగానే వీడియో ఆఫ్, మ్యూట్ వాయిస్, రిజెక్ట్ బటన్ ఆప్షన్లు ఉంటాయి. వాట్సాప్ మొబైల్ వెర్షన్‌లో మాత్రమే వాయిస్ లేదా వీడియో కాల్ ఫీచర్ ఉంది. వాట్సాప్ గ్రూప్ వాయిస్, వీడియో కాల్స్ లో 8 మంది మాత్రమే జాయిన్ కావొచ్చు.