WhatsApp: రంగుల్లో.. వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్..

WhatsApp: రంగుల్లో.. వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్..

Whatsapp Will Soon Allow Users To Change Colours In The App

WhatsApp:మిలియన్ల మంది వినియోగదారులకు అత్యంత ఇష్టమైన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్.. వినియోగదారుల చాట్ అనుభవాన్ని మెరుగుపరచడానికి కొత్త అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకుని వస్తుంది. ప్రతి సంవత్సరం మాదిరిగా, ఈ ఏడాది కూడా చాలా కొత్త ఫీచర్లు వాట్సాప్‌లో వస్తున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా మరో ఇంట్రస్టింగ్ ఫీచర్‌ను వాట్సప్ అందుబాటలోకి తీసుకుని వచ్చింది.

మెసేజింగ్​ యాప్​ వాట్సాప్ ఇటీవల రూపొందించిన నూతన ప్రైవసీ పాలసీ వివాదాస్పదం అవగా.. కొంతమంది యూజర్లు సిగ్నల్​, టెలిగ్రామ్​ వంటి యాప్స్​కు మారుతున్నారు. ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలకు దిగిన వాట్సాప్​ తమ యూజర్లు చేజారకుండా ఉండేందుకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. లేటెస్ట్‌గా వాట్సాప్​ చాట్​ బాక్స్​ రంగులను మార్చడానికి యూజర్లకు అనుమతి ఇస్తూ కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకుని వచ్చింది.

అంతేకాక, యూజర్లు తమ సందేశాలను ఇకపై కేవలం నలుపు రంగులోనే కాకుండా ముదురు నీలం ఆకుపచ్చ రంగుల్లోనూ టైప్​ చేసే ఫీచర్​ను చేర్చింది. దీంతో యూజర్లు అట్రాక్టివ్​ కలర్స్‌లో వాట్సాప్​ను మార్చుకోవచ్చు. ఈ ఫీచర్​ ప్రస్తుతానికైతే, ఐఓఎస్​ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్​ యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై ఇప్పటికి ఎటువంటి స్పష్టత లేదు.

యూజర్ల సౌలభ్యం కొరకు వాయిస్ మెసేజెస్​ ప్లేబ్యాక్ స్పీడ్​ను అడ్జెస్ట్​ చేసుకునే ఫీచర్​పై కూడా వాట్సప్ పనిచేస్తోంది. ఈ ఫీచర్​ను కూడా తొలుత iOS బీటా వర్షన్​లో అందుబాటులోకి తీసుకుని రానున్నట్లుగా కంపెనీ ప్రకటించింది.