WhatsApp : దీపావళి తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

WhatsApp : మీరు పాత ఐఫోన్‌ని ఉపయోగిస్తున్నారా? మీ ఫోన్ పాత iOS వెర్షన్‌లో రన్ అవుతుందా? అయితే మీరు మీ ఐఫోన్‌ని వెంటనే అప్‌గ్రేడ్ చేసుకోండి. లేదంటే iOS లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోండి. మీరు అలా చేయకపోతే.. మీ WhatsApp యాక్సెస్‌ను కోల్పోవచ్చు.

WhatsApp : దీపావళి తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

WhatsApp will stop working on older iPhones after Diwali, check if your phone is on the list

WhatsApp : మీరు పాత ఐఫోన్‌ని ఉపయోగిస్తున్నారా? మీ ఫోన్ పాత iOS వెర్షన్‌లో రన్ అవుతుందా? అయితే మీరు మీ ఐఫోన్‌ని వెంటనే అప్‌గ్రేడ్ చేసుకోండి. లేదంటే iOS లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోండి. మీరు అలా చేయకపోతే.. మీ WhatsApp యాక్సెస్‌ను కోల్పోవచ్చు. ఎందుకంటే ఈ దీపావళి (Diwali 2022) నుంచి గడువు ముగిసిన ఐఫోన్‌లలో మెసేజింగ్ యాప్ త్వరలో పని చేయడం నిలిచిపోనుంది. Apple నుంచి అప్‌డేట్ ప్రకారం.. iOS 10, iOS 11 డివైజ్‌ల్లో నడుస్తున్న iPhone అక్టోబర్ 24 నుంచి WhatsAppకి సపోర్టు ఇవ్వడం నిలిచిపోనుంది.

WhatsApp ఇకపై iOS 10 లేదా iOS 11లో రన్ కాదని iPhone యూజర్లకు తెలియజేస్తోంది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ని కొనసాగించాలంటే పాత ఐఫోన్ యూజర్లు తమ iOSని అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. WhatsApp హెల్ప్ సెంటర్ పేజీ ప్రకారం, iPhone యూజర్లు వాట్సాప్ యాప్‌ని కొనసాగించడానికి iOS 12 లేదా అంతకంటే కొత్త వెర్షన్ అప్‌డేట్ చేసుకోవాలి.

WhatsApp will stop working on older iPhones after Diwali, check if your phone is on the list

WhatsApp will stop working on older iPhones after Diwali, check if your phone is on the list

ముఖ్యంగా, iOS 10, iOS 11 సాఫ్ట్‌వేర్ వెర్షన్‌లలో చాలా iPhoneలు రన్ కావడం లేదు. iPhone 5 లేదా iPhone 5Cని ఉపయోగించే iPhone యూజర్లు iOS, WhatsAppని అప్‌డేట్ చేసిన తర్వాత WhatsAppని ఉపయోగించవచ్చు. అయితే, iPhone 4, iPhone 4S యూజర్ల కోసం కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఇదే సమయం ఆసన్నమైంది. WhatsApp ఇకపై డివైజ్‌కు సపోర్టు ఇవ్వదని గుర్తించాలి. ప్రైవసీ, యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అప్‌గ్రేడ్ చేయడంలో WhatsApp నిరంతరం పనిచేస్తుంది.

అందుకోసం ఆపిల్, ఆండ్రాయిడ్ అందించిన లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో సరిపోయే డెవలప్‌మెంట్‌లపై మెసేజింగ్ యాప్ ఫోకస్ పెట్టింది. WhatsAppలోని కొత్త అప్‌డేట్‌లు పాత OS, డివైజ్‌లకు సపోర్టు ఇవ్వవని గుర్తించాలి. ఆండ్రాయిడ్ డివైజ్ యూజర్లకు తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ను కొనసాగించడానికి ఆండ్రాయిడ్ 4.1 లేదా నెక్స్ట్ వెర్షన్ కూడా అవసరమని గుర్తించాలి.

ఒకవేళ మీ iPhone ఆటో-అప్‌డేట్‌లో లేనట్లయితే.. మీరు Settings > Generalకు వెళ్లడం ద్వారా iOS సరికొత్త వెర్షన్‌కి అప్‌డేట్ చేయవచ్చు. ఆపై లేటెస్ట్ iOS వెర్షన్‌ను పొందడానికి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ని Tap చేయండి. మీరు కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. పండుగ సేల్ సమయంలో అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో iPhone 12, iPhone 13పై బెస్ట్ డీల్స్ ద్వారా మరెన్నో డిస్కౌంట్‌లను పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp iOS Update : ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్లు.. ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి!