వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీ ఫొటోను ఫార్వార్డ్ చేయలేరు.. చూడగానే ఆటో డిలీట్ అయిపోతుంది!

వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీ ఫొటోను ఫార్వార్డ్ చేయలేరు.. చూడగానే ఆటో డిలీట్ అయిపోతుంది!

Whatsapp self-destructing photos future update : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఒకటి వస్తోంది. అదే.. సెల్ఫ్‌ డిస్ట్రక్టింగ్‌ ఫొటోస్‌ ఫీచర్‌.. ఈ ఫీచర్ ద్వారా మీ ఫొటోలను ఇతరులు ఫార్వార్డ్ చేయలేరు.. అంతేకాదు.. వారి ఫోన్ లో కూడా సేవ్ చేయలేరు.. స్ర్కీన్ షాట్ కూడా తీయలేరు.. ఫొటోను చూసి చాట్ బాక్సు నుంచి బయటకు రాగానే వెంటనే ఆ ఫొటో డిలీట్ అయిపోతుంది. ఈ ఫీచర్ ఇన్ స్టాగ్రామ్ డైరెక్ట్, ఫేస్ బుక్ మెసేంజర్ లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఇప్పుడు వాట్సాప్ లోకి వచ్చేస్తోంది. ఇంతకీ ఈ ఫొటో ఫీచర్ ఎలా పనిచేస్తుంది అనేకదా మీ డౌట్.. ఏం లేదు.. సింపుల్.. మీరు ఎవరికైనా ఏదైనా ఒక ఫోటో పంపారునుకోండి.. ఆ ఫొటోను రిసీవ్ చేసుకున్న వ్యక్తి.. కేవలం చూడగలడు.. అది కూడా ఒకసారి మాత్రమే.. మరొకరికి ఆ ఫొటోను ఫార్వార్డ్ చేయలేడు. తన ఫోన్ లోనూ సేవ్ చేయలేడు. పోనీ స్ర్కీన్ షాట్ కూడా తీయలేడు. కొన్ని నిమిషాల్లో అతడి వాట్సాప్ చాట్ బాక్సులో నుంచి మీరు పంపిన ఫొటో మాయమైపోతుంది. అంటే డిలీట్ ఆటోమాటిక్ గా డిలీట్ అయిపోతుంది.


మీరు ఫొటోను షేర్ చేసే ముందు చేయాల్సిందిల్లా ఒకటే.. యాడ్ కాప్షన్ అనే బాక్స్ కనిపిస్తుంది. దాని పక్కనే ఒక క్లాక్ సింబల్ కూడా ఉంటుంది. దాన్ని టచ్ చేసి యాక్టివేట్ చేయండి చాలు. అంతే మీరు పంపిన ఫొటోను అవతలి వ్యక్తి చూడగానే డిలీట్ అయిపోతుంది. చాట్ బాక్సులో ఉన్నంతసేపు కనిపిస్తుంది. ఎప్పుడు అయితే చాట్ బాక్సు నుంచి బయటకు వస్తాడో అంతే.. ఫొటో డిలీట్ అయిపోతుంది. మళ్లీ కనిపించదు. దాన్ని తిరిగి ఎక్స్ పోర్ట్ చేయడం కుదరదు. ఈ స్పెషల్ ఎట్రాక్షన్ ఫొటో ఫీచర్ ను వాట్సాప్ తమ వినియోగదారుల ప్రైవసీ కోసం అందుబాటులోకి తీసుకొస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్ అప్ డేట్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్ల అందరికి అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తోంది.