WhatsApp Call Link : వాట్సాప్‌లో కొత్త కాల్ లింక్ ఫీచర్.. వేలాది సభ్యులు గ్రూప్ కాల్స్ చేసుకోవచ్చు.. ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?

WhatsApp Call Link : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త కాల్ లింక్‌ల ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త ఫీచర్ దశలవారీగా యూజర్లకు చేరువవుతోంది. కొత్త అప్‌డేట్ యాప్‌లో గ్రూప్ కాలింగ్ ఫీచర్‌ (Group Calling Feature)ను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది.

WhatsApp Call Link : వాట్సాప్‌లో కొత్త కాల్ లింక్ ఫీచర్.. వేలాది సభ్యులు గ్రూప్ కాల్స్ చేసుకోవచ్చు.. ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?

WhatsApp's new Call Link is a neat solution to create large group calls, feature now in India

WhatsApp Call Link : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త కాల్ లింక్‌ల ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త ఫీచర్ దశలవారీగా యూజర్లకు చేరువవుతోంది. కొత్త అప్‌డేట్ యాప్‌లో గ్రూప్ కాలింగ్ ఫీచర్‌ (Group Calling Feature)ను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. WhatsApp కాల్ లింక్‌తో, యూజర్ కాన్ఫరెన్స్ కాల్‌లో చేరేందుకు ఇతరులను అనుమతించవచ్చు. మీరు షేర్ చేయాల్సిన లింక్‌ని క్రియేట్ చేయవచ్చు. లింక్ కాల్ ఉన్న ఎవరైనా మీ గ్రూప్‌లో భాగం కాకపోయినా కాల్‌లో జాయిన్ కావొచ్చు. లింక్ 90 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది.

Samsung స్మార్ట్‌ఫోన్‌లో ఫీచర్‌ అందుబాటులో ఉంది. సర్వర్ సైడ్ అప్‌డేట్‌గా ఈ ఫీచర్ కనిపిస్తుంది. వాట్సాప్ యూజర్లు ఈ ఫీచర్‌లను పొందాలంటే తమ యాప్‌ను అప్‌డేట్‌గా చేసుకోవాల్సిందిగా నివేదిక సూచిస్తోంది. WhatsApp అతి త్వరలో యూజర్లకు కాల్ లింక్‌లను ప్రారంభించే అవకాశం ఉంది. కాల్ లింక్ ఫీచర్ చెక్ చేసేందుకు కాల్స్ ట్యాబ్‌కు వెళ్లాలి. టాప్ కాల్ లింక్‌ల ఫీచర్ పొందవచ్చు. మీరు ఎంపికపై క్లిక్ చేస్తే.. ఆటోమాటిక్ లింక్ క్రియేట్ అవుతుంది. యూజర్లు కాల్ టైప్ కూడా ఎంచుకోవచ్చు. ఆడియో లేదా వీడియో కింద యూజర్లు మూడు ఆప్షన్లను పొందవచ్చు. WhatsApp ద్వారా ఈ లింక్‌ను పంపవచ్చు. లింక్‌ను కాపీ చేసుకోవచ్చు. లింక్‌ను షేర్ చేయండి.

WhatsApp's new Call Link is a neat solution to create large group calls, feature now in India

WhatsApp’s new Call Link is a neat solution to create large group calls, feature now in India

ఒక యూజర్ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత రెండు ఆప్షన్లు ఉంటాయి. జాయిన్ అవ్వండి.. లేదంటే వదిలివేయవచ్చు. యూజర్లు తమ వీడియో కాల్ సమయంలో ఆడియోను మ్యూట్ చేయవచ్చు. వీడియోను హైడ్ చేయడం వంటి ఆప్షన్ పొందవచ్చు. WhatsApp కాల్ లింక్‌ల ఫీచర్ Zoom, Google Meet నుంచి రూపొందించారు. ఈ రెండు వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫారమ్‌లు యూజర్లను అదే పద్ధతిలో కాల్‌లో చేసేందుకు అనుమతిస్తుంది. అయినప్పటికీ, స్పెషల్ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫారమ్‌లు సాధారణ కాలింగ్ సామర్థ్యాల కన్నా చాలా ఎక్కువ అందిస్తున్నాయి.

జూమ్, Google Meetsలోని యూజర్లు తమ కాల్ రూంలను క్రియేట్ చేయవచ్చు. స్క్రీన్‌లను షేర్ చేయవచ్చు. లైవ్ లింకులను కూడా వీక్షించవచ్చు. కొత్త వాట్సాప్ ఫీచర్ చాట్ కోసం ప్లాట్‌ఫారమ్‌ను వినియోగించుకోవాలనుకునేవారికి సాయపడుతుంది. ప్రస్తుతం వాట్సాప్ యూజర్లకు గ్రూప్ కాల్‌లో 32 మంది సభ్యులను యాడ్ చేసేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. త్వరలో ఈ విధానం మారవచ్చు. మెటా-యాజమాన్య ప్లాట్‌ఫారమ్ త్వరలో 1024 మంది సభ్యులను యాడ్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుందని ఓ నివేదిక నివేదించింది. ఈ కాల్ లింక్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కాల్ లింక్‌లు మరింత ఉపయోగకరంగా మారనున్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp : దీపావళి తర్వాత ఈ పాత ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!