Whatsapp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మెసేజ్ డిలీట్ అయినా తిరిగి పొందొచ్చు..!

WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది. వాట్సాప్‌లో గ్రూపుల్లో అనేక పోస్టులు చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు వాట్సాప్ పొరపాటున డిలీట్ చేసేస్తుంటారు.

Whatsapp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మెసేజ్ డిలీట్ అయినా తిరిగి పొందొచ్చు..!

Whatsapp’s Upcoming Undo Button Will Help You Retrieve Chats Deleted By Mistake

WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది. వాట్సాప్‌లో గ్రూపుల్లో అనేక పోస్టులు చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు వాట్సాప్ పొరపాటున డిలీట్ చేసేస్తుంటారు. అలాంటి సమయంలో డిలీట్ చేసిన మెసేజ్ తిరిగి పొందడం కుదరదు. అందుకే వాట్సాప్ ఈ సమస్యకు పరిష్కారం కనిపెడుతోంది. వాట్సాప్ డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందేందుకు కొత్త టూల్‌పై వర్క్ చేస్తోంది. ప్రస్తుత సెటప్ మెసేజ్‌లను డిలీట్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది. చాట్ బాక్స్ నుంచి మెసేజ్‌లను మాత్రమే కాకుండా పంపిన మెసేజ్ డిలీట్ చేయండి.

కొన్నిసార్లు Delete for Everyone ఆప్షన్ బదులుగా Delete For me ఆప్షన్ ఉంది. ఈ క్రమంలో పొరపాటున డిలీట్ ఫర్ ఎవరీవన్ బటన్ నొక్కితే అందరి చాట్ బాక్సుల్లో నుంచి ఆ మెసేజ్ డిలీట్ అయిపోతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు వాట్సాప్ కొత్తగా Undo Button తీసుకొస్తోంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే.. ‘Delete For Me ఆప్షన్ ఎంచుకోవాలి. మీరు డిలీట్ చేసిన చాట్‌ను తిరిగి పొందవచ్చు. Wabetanifo ప్రకారం.. వాట్సాప్ త్వరలో Undo Button ప్రవేశపెట్టాలని తీసుకొస్తోంది.

Whatsapp’s Upcoming Undo Button Will Help You Retrieve Chats Deleted By Mistake (1)

Whatsapp’s Upcoming Undo Button Will Help You Retrieve Chats Deleted By Mistake

స్క్రీన్‌షాట్ ప్రకారం.. యూజర్లు ఎవరైనా Delete For Me ఆప్షన్ నొక్కితే.. WhatsApp వెంటనే యూజర్లకు ఒక పాప్-అప్‌ డిస్‌ప్లే అవుతుంది. టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లలో ఈ Undo Button ఇప్పటికే అందుబాటులో ఉంది. వాట్సాప్ టెలిగ్రామ్ తరహాలోనే ఈ Undo బటన్ ఉండనుంది. దాని ప్రకారం.. మీరు డిలీట్ చేసిన మెసేజ్ కొన్ని నిమిషాలు లేదా సెకన్లలోనే పొందవచ్చు.

వెబ్‌సైట్ వాట్సాప్ డెస్క్‌టాప్ బీటా యూజర్లలో కొత్త ఫీచర్‌ను వెర్షన్ 2.2221.1 గుర్తించింది. XDA ద్వారా షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం.. సెర్చ్ బాక్స్ పక్కన ఫిల్టర్ బటన్ కనిపిస్తుంది. మీరు ఫిల్టర్‌ను ఎంచుకున్నప్పుడు, WhatsApp అన్ని చాట్‌లను హైడ్ చేస్తుంది. మీరు చదవని చాట్‌లన్నింటినీ చూసిన తర్వాత.. ఫిల్టర్‌ను క్లియర్ చేయవచ్చు. అప్పుడు ఈ ఫిల్టర్ బటన్ ద్వారా మెయిన్ వాట్సాప్‌కు సులభంగా మారవచ్చు.

Read Also : Whatsapp : వాట్సాప్‌లో ఇక ఫుల్ మూవీ పంపుకోవచ్చు.. ఇలా చెక్ చేసుకోండి..!