Facebook ఆన్‌లైన్ ద్వేషాన్ని ప్రోత్సహిస్తుందా? మాజీ ఉద్యోగి వ్యాఖ్యలతో ఇబ్బందే!

భారతదేశంలో అత్యంత శక్తివంతమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా ఉన్న ఫేస్‌బుక్ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తుందా?

Facebook ఆన్‌లైన్ ద్వేషాన్ని ప్రోత్సహిస్తుందా? మాజీ ఉద్యోగి వ్యాఖ్యలతో ఇబ్బందే!

Fraudster Facebook Friend

Facebook: భారతదేశంలో అత్యంత శక్తివంతమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా ఉన్న ఫేస్‌బుక్ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తుందా? ఈ ప్రశ్న అనేకసార్లు లేవనెత్తినప్పటికీ, ఈసారి దీనిని తేలికగా తీసుకోలేము.. ఎందుకంటే ఇది దేశంలో, ప్రపంచంలో రాజకీయ పార్టీ చేసిన విమర్శకాదు. ఫేస్‌బుక్‌లో అత్యంత ముఖ్యమైన స్థానంలో డేటా సైంటిస్ట్‌గా పనిచేసిన ఫ్రాన్సిస్ హౌగెన్ (Frances Haugen) అనే మహిళ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.

నెలకు మూడు బిలియన్ల మంది యూజర్లు వాడే ఫేస్‌బుక్‌ మీద మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్‌ హౌగెన్‌ చేసిన ఆరోపణల్లో ఎంత నిజముందో? తెలియదు కానీ, అమెరికా, బ్రిటన్ పాలకులను మాత్రం ఈ మాట కదిలించింది. దీనిపై భారత్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ ఇది భారతదేశానికే ముప్పు కలిగించే విషయం అని, ఎందుకంటే ఇది నిజమైతే, మన లౌకిక, మతపరమైన నిర్మాణం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉందని, దీనిని అరికట్టడానికి ప్రభుత్వం వెంటనే అన్ని మార్గాలను అన్వేషించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికన్ కంపెనీ నిర్వహిస్తున్న ఫేస్‌బుక్, ట్విట్టర్ పనితీరుపై గతంలోనూ చాలా వివాదాలు ఉన్నాయి. చివరకు కోర్టు ఆదేశాల తర్వాత వారు భారతీయ చట్టాన్ని పాటించవలసి వచ్చింది కూడా. దీనికి కచ్చితమైన రుజువు లేకపోయినా, సోషల్ మీడియాలో ఏదైనా అబద్ధాన్ని దేశం ముందు పెద్ద సమస్యగా చూపించడం కొన్నాళ్లుగా జరుగుతున్నదే. అయితే ఇక్కడ విషయం ఆవశ్యకతను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆరోపణలో ఏదైనా నిజం ఉంటే, అది భారతదేశంపైనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల మత, సామాజిక నిర్మాణంపై కూడా ప్రభావం చూపుతుంది.

వాస్తవానికి, ఫేస్‌బుక్‌లో కొన్నేళ్లుగా డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తున్న ఫ్రాన్సిస్ హౌగెన్.. ఉద్యోగం మానేసిన తర్వాత, ఇప్పుడు విజిల్‌బ్లోయర్‌గా మారింది. సాధారణ భాషలో చెప్పాలంటే, ఆమె కంపెనీ రహస్యాలన్నింటినీ వెల్లడిస్తోంది. కంపెనీలో పనిచేసి అక్కడి నుంచి జాబ్ మానేసిన తర్వాత ఏ వ్యక్తి అయినా ఆ కంపెనీ బలహీనతలను ఎత్తిచూపడం లేదా చేస్తున్న తప్పుడు పనులను తరచూ ప్రస్తావిస్తూనే ఉంటే వారిని Whistleblower అంటారు. అయితే ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే.. ఫేస్‌బుక్ డేటా శాస్త్రవేత్త అయిన ఈ మహిళ, UK ఎంపీల ముఖ్యమైన కమిటీ ముందు ఈ ఆరోపణ చేశారు. ఈ విషయాన్ని సులభంగా విస్మరించలేమని అంటున్నారు నిపుణులు.

అబద్ధాలు, పుకార్లు, ద్వేషాన్ని వ్యాప్తి చేయడంలో సామాజిక మాధ్యమాల ప్రభావం భారతదేశంలో మాదిరిగానే UKలో కూడా ఎక్కువగా ఉంది. ఇది మరింత విస్తృతమైన ప్రభావాన్ని చూపుతుంది. కంటెంట్‌ను అరికట్టడానికి కొత్త చట్టాన్ని రూపొందించాలని ఆలోచిస్తోంది. ఇందుకోసం ఎంపీల కమిటీని ఏర్పాటు చేసి ముసాయిదా రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఇందుకోసం ఈ అంశంపై నిపుణులందరినీ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరింది.

ఫ్రాన్సెస్ హౌగెన్ అదే పార్లమెంటరీ కమిటీ ముందు హాజరయ్యారు. అక్కడ ఆమె UK చట్టసభ సభ్యులతో మాట్లాడుతూ “Facebook ఆన్‌లైన్ ద్వేషాన్ని, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది” అని అన్నారు.