Xbox Series S : ఫ్లిప్‌కార్ట్‌లో చౌకైన ధరకే Xbox Series S గేమింగ్ కన్సోల్‌.. రూ. 9వేలు ప్లాట్ డిస్కౌంట్.. డోంట్ మిస్..!

Xbox Series S : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Sale) ఇప్పుడు ప్లస్ మెంబర్‌షిప్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేసింది. స్పెషల్ ఆఫర్‌లు సెప్టెంబర్ 23 నుంచి అందరికీ అందుబాటులోకి రానున్నాయి.

Xbox Series S : ఫ్లిప్‌కార్ట్‌లో చౌకైన ధరకే Xbox Series S గేమింగ్ కన్సోల్‌.. రూ. 9వేలు ప్లాట్ డిస్కౌంట్.. డోంట్ మిస్..!

Xbox Series S available for as low as Rs 25,990 at Flipkart Big Billion Days sale

Xbox Series S : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Sale) ఇప్పుడు ప్లస్ మెంబర్‌షిప్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేసింది. స్పెషల్ ఆఫర్‌లు సెప్టెంబర్ 23 నుంచి అందరికీ అందుబాటులోకి రానున్నాయి. అనేక పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర డివైజ్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. దీపావళి సేల్స్ (Diwali Sale) కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లు తక్కువ ధరకు గేమింగ్ కన్సోల్‌ (Xbox Series S)ను కొనుగోలు చేయవచ్చు. అందుకు ఇదే సరైన సమయంగా చెప్పవచ్చు.

Xbox Series S available for as low as Rs 25,990 at Flipkart Big Billion Days sale

Xbox Series S available for as low as Rs 25,990 at Flipkart Big Billion Days sale

ప్రముఖ మైక్రోసాఫ్ట్ Xbox Series S చాలా తక్కువ ధరకు Flipkartలో సేల్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం రూ. 25,990 ధర ట్యాగ్‌తో అందుబాటులో ఉంది. వాస్తవానికి దీని ప్రారంభ ధర రూ.34,990గా ప్రకటించారు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా (512GB స్టోరేజ్ మోడల్)పై రూ. 9వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.

మీకు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ లేకపోతే.. ఆందోళన అక్కర్లేదు. ఎందుకంటే.. మీరు ఈ గేమింగ్ కన్సోల్‌ను అదే ధరకు సెప్టెంబర్ 23న కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ ఈవెంట్ నెలాఖరు వరకు కొనసాగుతుంది. ప్రస్తుతానికి, Xbox సిరీస్ X వేరియంట్‌పై ఎలాంటి తగ్గింపు ఆఫర్ అందించలేదు. ప్రస్తుతం రూ. 52,999కి సేల్ ఆఫర్ చేస్తోంది. Xbox సిరీస్ Sలో బ్యాంక్ ఆఫర్‌ల విషయానికొస్తే.. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 750 డిస్కౌంట్ అందిస్తోంది. EMI లావాదేవీలపై ఉంటుంది. సోనీ ప్లేస్టేషన్ 5 లేదా ప్లేస్టేషన్ 4లో ఏదైనా డిస్కౌంట్ ఆఫర్ లేదనే చెప్పాలి.

Xbox Series S available for as low as Rs 25,990 at Flipkart Big Billion Days sale

Xbox Series S available for as low as Rs 25,990 at Flipkart Big Billion Days sale

ఫ్లిప్‌కార్ట్ (Flipkart), అమెజాన్‌ (Amazon)లో రెండు వెర్షన్‌లు స్టాక్‌లో లేవు. కొన్ని నివేదికల ప్రకారం.. ఈ రెండు డివైజ్‌లు వచ్చే వారం అందుబాటులోకి వస్తాయి. ప్లేస్టేషన్ లేదా Xbox సిరీస్ X వెర్షన్‌ను కొనుగోలు చేయడం చాలా కష్టమే.. ఎందుకంటే ఈ డివైజ్‌లు చాలా వరకు స్టాక్‌లో లేవు. Xbox సిరీస్ Sలో ఖరీదైన Xbox సిరీస్ X వంటి హై-ఎండ్ ఫీచర్లు లేవు. సగటు గేమర్‌లకు సరిపోతుందని చెప్పవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో కొనుగోలుదారులు చాలా తక్కువ ధరకు పొందవచ్చు.

Read Also : iPhone 12 Massive Discount : అమెజాన్‌లో ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. స్టాక్ ఉండగానే కొనుక్కోండి.. ఇండియాలో ధర ఎంతంటే?