Xiaomi 12 Lite : నాలుగు రంగులలో షావోమీ కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్..!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి మరో కొత్త వెర్షన్ స్మార్ట్ ఫోన్ వస్తోంది. రాబోయే ప్రీమియం స్మార్ట్ ఫోన్ Xiaomi 12 Lite వెర్షన్.. ఈ ఫోన్ అతి త్వరలో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది.

Xiaomi 12 Lite : నాలుగు రంగులలో షావోమీ కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్..!

Xiaomi 12 Lite Colour Options Teased Ahead Of Global Launch, Specifications Leaked

Xiaomi 12 Lite : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి మరో కొత్త వెర్షన్ స్మార్ట్ ఫోన్ వస్తోంది. రాబోయే ప్రీమియం స్మార్ట్ ఫోన్ Xiaomi 12 Lite వెర్షన్.. ఈ ఫోన్ అతి త్వరలో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. రాబోయే ప్రీమియం స్మార్ట్‌ఫోన్ నాలుగు రంగుల ఆప్షన్లలో రానుంది. లాంచింగ్ ముందే Xiaomi 12 Lite స్మార్ట్ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి. USP సన్నని ఫెదర్‌వెయిట్ స్లిమ్ డిజైన్‌గా ఉంటుంది. Xiaomi 12 Lite నాలుగు కలర్ ఆప్షన్లలో లాంచ్ అవుతుంది. అందులో పర్పుల్, గ్రీన్, పింక్ సిల్వర్ ఉంటుందని అంచనా. ఈ ఫోన్‌కు సంబంధించి కంపెనీ అధికారికంగా వివరాలను వెల్లడించలేదు. కొన్నింటిలో Xiaomi 12 Lite స్పెసిఫికేషన్‌లు ధృవీకరించాయి. Xiaomi 12 Lite ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. వెనుక భాగంలో దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. ఈ డివైజ్ లార్జ్ సర్కిల్ కటౌట్‌తో రానుంది. అంతేకాదు.. కిందిభాగంలో రెండు ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.

LED ఫ్లాష్ మాడ్యూల్ కెమెరా మాడ్యూల్ లోపల ఉంది. ఈ ఫోన్ 159.30 x 73.70 x 7.29 మిమీ, 173 గ్రాముల బరువు ఉంటుంది. హుడ్ కింద 4300 mAh బ్యాటరీతో రానుంది. Mi 11 Lite ఫోన్ 4250 mAh బ్యాటరీ కన్నా బ్యాటరీ సామర్థ్యం కొంచెం పెద్దదిగా ఉంటుంది. Xiaomi 12 Lite స్మార్ట్ ఫోన్.. బ్యాటరీ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. ఈ డివైజ్ 6.55-అంగుళాల డిస్‌ప్లేతో చాలా పొడవుగా ఉంటుంది. Full HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో AMOLED డిస్‌ప్లేను ఉంటుంది.

Xiaomi 12 లైట్ డిస్‌ప్లే HDR10+ డాల్బీ విజన్‌కి కూడా సపోర్టు ఇస్తుంది. Qualcomm Snapdragon 778G SoC అందుబాటులో ఉంటుంది. 6GB/8GB RAMతో పాటు 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. Xiaomi 12 లైట్ కెమెరా సెటప్ కూడా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. 108MP ప్రైమరీ కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్ సెన్సార్, 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం.. ఈ ఫోన్‌లో 32MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. Xiaomi ఫోన్ ఖచ్చితమైన లాంచ్ తేదీని ధృవీకరించలేదు. Xiaomi 12 Lite గ్లోబల్‌గా లాంచ్ చేసిన తర్వాత ఈ ఏడాది చివర్లో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Read Also : Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?