Xiaomi 12 Pro : ఇండియాలో ఫస్ట్ టైం.. 3 కెమెరాలతో షావోమీ 12ప్రో ఫోన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Xiaomi 12 Pro : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం Xiaomi 12 Pro కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. Xiaomi ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో గ్లోబల్ మార్కెట్లో ప్రవేశపెట్టింది.

Xiaomi 12 Pro : ఇండియాలో ఫస్ట్ టైం.. 3 కెమెరాలతో షావోమీ 12ప్రో ఫోన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Xiaomi 12 Pro Launched In India With Three 50mp Camera Sensors, Snapdragon 8 Gen 1 Soc Price, Specifications

Xiaomi 12 Pro : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం Xiaomi 12 Pro కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. Xiaomi ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో గ్లోబల్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా Xiaomi 12 సిరీస్‌లో టాప్-టైర్ స్మార్ట్‌ఫోన్ ఇదే.. అయితే ఈ కొత్త స్మార్ట్ ఫోన్ (Xiaomi 12 Pro) Qualcomm టాప్-ఆఫ్-ది-లైన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoCతో వచ్చింది. Xiaomi 12 Proతో పాటు, Xiaomi భారత్‌లో Xiaomi Pad5ని కూడా రిలీజ్ చేసింది. ఆండ్రాయిడ్ టాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 860 SoC, 11-అంగుళాల డిస్‌ప్లేతో వచ్చింది.

Xiaomi 12 ప్రో ఫీచర్లు, ధర ఎంతంటే? :
షావోమీ 12ప్రో స్మార్ట్ ఫోన్ డివైజ్ 6.73-అంగుళాల QHD+ AMOLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వచ్చింది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ లేయర్ 1500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వచ్చింది. 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ కిందిభాగంలో Qualcomm Snapdragon 8 Gen 1 SoC ఉంది. భారత మార్కెట్లో గరిష్టంగా 12GB RAMతో పాటు 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది. ఈ ఫోన్ 4600 mAh బ్యాటరీతో 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. అంతేకాదు… 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. షావోమీ 12ప్రో ఫోన్ వెనుక కెమెరా సెటప్‌లో మూడు 50MP సెన్సార్లు ఉన్నాయి.

Xiaomi 12 Pro Launched In India With Three 50mp Camera Sensors, Snapdragon 8 Gen 1 Soc Price, Specifications (1)

Xiaomi 12 Pro Launched In India With Three 50mp Camera Sensors, Snapdragon 8 Gen 1 Soc Price, Specifications

ప్రధాన 50MP Sony IMX707 కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు సపోర్టు చేస్తుంది. 50MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12-ఆధారిత MIUI 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో హర్మాన్ కార్డాన్-ట్యూన్డ్ క్వాడ్-స్పీకర్‌లు ఉన్నాయి. డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్‌కు సపోర్టు అందిస్తుంది. Xiaomi 12 Pro స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్‌ (8GB+256GB, 12GB+256GB)లలో వస్తుంది. బ్లూ, గ్రే, పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. బేస్ ఫోన్ 8GB RAM ఆప్షన్‌తో రూ. 62,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. మరోవైపు 12GB + 256GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.66,999కు అందుబాటులో ఉంది.

Xiaomi 12 Pro స్మార్ట్ ఫోన్ సేల్.. మే 2 నుంచి Mi.com, Mi హోమ్ స్టోర్స్, Amazon ప్లాట్ ఫారంలో అందుబాటులో ఉండనుంది. లాంచ్ ఆఫర్‌లలో భాగంగా ICICI బ్యాంక్ కార్డ్ హోల్డర్లు Xiaomi 12 Pro కొనుగోలుపై రూ. 6,000 డిస్కౌంట్ పొందవచ్చు. రూ. 4,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. బేస్ మోడల్‌కి మొత్తం ధర రూ. 52,999కి తగ్గింది. Xiaomi 12 Proతో పాటు, Xiaomi భారత్‌లో Xiaomi Pad 5 ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను రిలీజ్ చేసింది. టాబ్లెట్‌లో 11-అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 860 SoC వంటి ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి.

Read Also : Smart Phones Risk : 67శాతం ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ ప్రమాదం తప్పదంటున్న నిపుణులు..బీకేర్ ఫుల్