Xiaomi 13 Series : షావోమీ 13 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఎప్పుడో తెలిసిందోచ్.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Xiaomi 13 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) నుంచి (Xiaomi 13 Series) స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 11న అధికారికంగా లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ మీడియా ఇన్విటేషన్లను పంపుతోంది. దీనికి సంబంధించి షావోమీ టీజర్‌ను కూడా షేర్ చేసింది.

Xiaomi 13 Series : షావోమీ 13 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఎప్పుడో తెలిసిందోచ్.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Xiaomi 13 Series is officially coming on December 11, here is what to expect

Xiaomi 13 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) నుంచి (Xiaomi 13 Series) స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 11న అధికారికంగా లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ మీడియా ఇన్విటేషన్లను పంపుతోంది. దీనికి సంబంధించి షావోమీ టీజర్‌ను కూడా షేర్ చేసింది. మూడు రోజుల్లో రెండు ఫ్లాగ్‌షిప్ 5G ఫోన్లను లాంచ్ చేస్తుందని నివేదిక సూచిస్తోంది. Xiaomi 13, Xiaomi 13 Pro మోడల్‌లు వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంలో కొత్త డివైజ్‌‌ షావోమీ సిరీస్  భారత మార్కెట్లోకి రావొచ్చునని భావిస్తున్నారు. Xiaomi భారత మార్కెట్లో లాంచ్ తేదీని ఇంకా నిర్ధారించలేదు.

Xiaomi 13 Pro : స్పెసిఫికేషన్‌లు (అంచనా) :

షావోమీ (Xiaomi 13 Pro)తో కంపెనీ మెరుగైన పర్పార్మెన్స్ ఫోన్‌గా కొన్నింట్లో మాత్రమే మార్పులు చేయవచ్చు. షావోమీ ప్రో వేరియంట్ పాత డిస్‌ప్లేను అలాగే ఉంచుతుందని, మెరుగైన బ్రైట్‌నెస్ ఆఫర్ చేస్తుందని వచ్చిన లీక్‌లు సూచిస్తున్నాయి. Xiaomi 13 ప్రో 6.73-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉందని తెలిపింది. 2K రిజల్యూషన్‌తో పనిచేస్తుంది. E6 AMOLED ప్యానెల్ 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు లీక్‌ల ప్రకారం.. 1,900nits గరిష్ట ప్రకాశానికి మద్దతునిస్తుంది. Qualcomm కొత్త స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. గరిష్టంగా 16GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజీతో బ్యాకప్ చేయవచ్చు. కెమెరా సెటప్ మునుపటి మోడల్ నుంచి కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు.

Xiaomi 13 Series is officially coming on December 11, here is what to expect

Xiaomi 13 Series is officially coming on December 11

Read Also : Xiaomi Book Air 13 : షావోమీ బుక్ ఎయిర్ 13 ల్యాప్‌టాప్ వస్తోంది.. రెడ్‌మి నోట్ 12 సిరీస్ ఫోన్ కూడా.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Xiaomi 13 Pro వెనుక భాగంలో అదే 50-MP సెటప్‌ను కలిగి ఉంది. కానీ, విభిన్న సెన్సార్‌లతో ఉంటుంది. హ్యాండ్‌సెట్ 50-MP సోనీ IMX989 1-అంగుళాల సెన్సార్, 50-MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 50-MP టెలిఫోటో కెమెరాతో రావచ్చని లీక్‌లు సూచిస్తున్నాయి. సెల్ఫీల కోసం.. ముందు భాగంలో అదే 32-MP సెల్ఫీ సెన్సార్‌ను అందిస్తుంది.

షావోమీ ప్రో మోడల్ మెరుగైన బ్యాటరీ లైఫ్ అందించనుంది. గత మోడల్ పోలిస్తే.. పెద్ద 4,820mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కంపెనీ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. Xiaomi రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందిస్తుందో లేదో ప్రస్తుతానికి తెలియదు. ఈ విషయం లాంచ్ తర్వాతే తెలుస్తుంది. బాక్స్ వెలుపల ఆండ్రాయిడ్ 13 OSతో రానుందని చెప్పవచ్చు.

Xiaomi 13 Series is officially coming on December 11, here is what to expect

Xiaomi 13 Series is officially coming on December 11

Xiaomi 13: స్పెసిఫికేషన్‌లు (అంచనా) :
లీక్‌ల ప్రకారం.. Xiaomi 13 ప్రో మోడల్‌తో కొన్ని స్పెసిఫికేషన్‌లను షేర్ చేసింది. స్టాండర్డ్ మోడల్ కొంచెం చిన్న స్క్రీన్, బ్యాటరీతో వస్తుందని చెప్పవచ్చు. కెమెరా విభాగం, డిజైన్‌లో కూడా స్వల్ప మార్పులు ఉంటాయి. Xiaomi 13 అదే Qualcomm Snapdragon 8 Gen 2chip ద్వారా పవర్ అందిస్తుంది. ఇది ప్రో మోడల్‌లో ఉంటుందని ఇప్పటివరకు వచ్చిన లీక్‌లు సూచిస్తున్నాయి. 2K రిజల్యూషన్‌తో 6.2-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుందని చెప్పారు. ప్యానెల్ 120Hz, DC డిమ్మింగ్, HDR 10+కి సపోర్టు అందిస్తుందని చెప్పవచ్చు.

నివేదిక ప్రకారం.. ఫ్లాట్ ఎడ్జ్‌లను కలిగి ఉంటుందని తెలిపింది. ప్రో మోడల్‌తో కర్వడ్ డిస్‌ప్లే డిజైన్‌తో రానుంది. టెలిఫోటో సెన్సార్ Xiaomi 13 ప్రోతో రానున్నట్టు కనిపిస్తోంది, ఈ కెమెరా మినహా, ప్రామాణిక మోడల్‌లో అదే ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్ ఉంటుందని చెప్పవచ్చు. మూడవ సెన్సార్ మాక్రో షాట్‌లతో రానుందని తెలిపింది. ముందు భాగం కూడా ప్రో మోడల్ లాగానే ఉంటుంది. Xiaomi 13 చిన్న 4,700mAh బ్యాటరీతో 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Xiaomi New Laptops : భారత్‌లో షావోమీ నుంచి త్వరలో రెండు కొత్త ల్యాప్‌టాప్స్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?