Xiaomi HyperCharge Fast Charge : షియోమి 200W హైపర్‌ఛార్జ్ టెక్.. 8 నిమిషాల్లోనే 100% ఫాస్ట్ ఛార్జింగ్

షియోమి 200W హైపర్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. 4,000mAh బ్యాటరీని 8 నిమిషాల్లోపు పూర్తిగా ఛార్జ్ చేస్తుంది.

Xiaomi HyperCharge Fast Charge : షియోమి 200W హైపర్‌ఛార్జ్ టెక్.. 8 నిమిషాల్లోనే 100% ఫాస్ట్ ఛార్జింగ్

Hypercharge Fast

Xiaomi HyperCharge Fast Charge : షియోమి 200W హైపర్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. 4,000mAh బ్యాటరీని 8 నిమిషాల్లోపు పూర్తిగా ఛార్జ్ చేస్తుంది. షియోమీ కంపెనీ అదనంగా 120W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఇది 15 నిమిషాల్లో ఒకే బ్యాటరీ సామర్థ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తుందని పేర్కొంది.

గత ఏడాది Mi 10 Ultra, 80W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ప్రవేశపెట్టిన తర్వాత 200W హైపర్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొస్తోంది. 200W ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందించే మొట్టమొదటి OEM షియోమి కూడా ఇదే.

షియోమీ కొత్త వైర్డు, వైర్‌లెస్ సాంకేతికతో 4,000mAh బ్యాటరీ చార్జ్‌తో ఎంత వేగంగా పూర్తి అవుతుందో చూపించే వీడియోను పోస్ట్ చేసింది. ఫోన్ 10 శాతం వరకు ఛార్జ్ చేయడానికి కేవలం 44 సెకన్లు పట్టగా.. 50 శాతానికి ఛార్జ్ చేయడానికి కేవలం 3 నిమిషాలు మాత్రమే సమయం పడుతుంది.

వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఫోన్ 8 నిమిషాల్లోపు పూర్తిగా ఛార్జ్ అవుతుంది. వైర్డ్ ఛార్జింగ్ ప్లేసులో ఒప్పో ప్రస్తుతం దాని 125W ఫ్లాష్ ఛార్జ్‌ను కలిగి ఉంది. 20 నిమిషాల్లో 4,000mAh బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తుంది.