Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు షావోమీ Mi బ్యాండ్ 7 ప్రీమియం వెర్షన్ లాంచ్ చేసింది. Mi Band 7 Pro ధర ఎంత, స్పెసిఫికేషన్‌లు ఏంటో ఓసారి లుక్కేయండి.

Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Xiaomi Mi Band 7 Pro With Always On Display, Gps Support Launched Price, Specifications

Xiaomi Mi Band 7 Pro : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు షావోమీ Mi బ్యాండ్ 7 ప్రీమియం వెర్షన్ లాంచ్ చేసింది. Mi బ్యాండ్ 7proగా వచ్చిన ఈ Mi బ్యాండ్ 7pro  అతి పెద్ద స్క్రీన్‌తో అచ్చం స్మార్ట్‌వాచ్‌లా కనిపిస్తుంది. ఈ వాచ్ 1.64-అంగుళాల దీర్ఘచతురస్రాకార AMOLED డిస్‌ప్లేతో పాటు 326ppi పిక్సెల్ డెన్సిటీతో వచ్చింది. Mi బ్యాండ్ 7pro స్మార్ట్‌ఫోన్‌పై ఆధారపడకుండా లొకేషన్-బేస్డ్ ట్రాకింగ్‌ను అందించే GPS సపోర్టు కలిగి ఉంది. Mi Band 7లో మాదిరి  ఫీచర్లు ఇందులో ఉన్నాయి. Mi బ్యాండ్ 7pro మేలో లాంచ్ అయిన Mi బ్యాండ్ 7 అప్‌గ్రేడ్ వెర్షన్. Mi బ్యాండ్ 7pro చైనాలో లాంచ్ అయింది. కానీ భారత్ మార్కెట్లో ఇంకా లాంచ్ కాలేదు. Mi Band 7 Pro ధర ఎంత, స్పెసిఫికేషన్‌లు ఏంటో ఓసారి లుక్కేయండి.

ధర ఎంతంటే? :
షావోమీ Mi Band 7 Pro చైనాలో CNY 379 (దాదాపు రూ. 4,500) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. లాంచ్ ఆఫర్ కింద జూలై 7 వరకు మాత్రమే ఈ స్మార్ట్ బ్యాండ్ అందుబాటులో ఉంటుంది. స్మార్ట్‌బ్యాండ్ CNY 399 (దాదాపు రూ. 4,700) వద్ద అందుబాటులో ఉంటుంది. స్మార్ట్‌బ్యాండ్ బ్లూ, గ్రీన్, ఆరెంజ్, పింక్, వైట్ కలర్ వేరియంట్‌లతో సహా వివిధ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Xiaomi Mi Band 7 Pro With Always On Display, Gps Support Launched Price, Specifications (1)

Xiaomi Mi Band 7 Pro With Always On Display, Gps Support Launched Price, Specifications 

స్పెసిఫికేషన్‌లు :
షావోమీ Mi Band 7 Pro 280×456 పిక్సెల్‌ల రిజల్యూషన్, 326ppi పిక్సెల్ డెన్సిటీతో 1.64-అంగుళాల రెక్టా యాంగ్యులర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. వాచ్ ప్రొటెక్షన్ కోసం 2.5D గాజుతో వచ్చింది. స్మార్ట్‌బ్యాండ్ ఆన్ ఇన్ డిస్‌ప్లేతో వస్తుంది. Mi బ్యాండ్ 7pro కూడా ఇంటర్నల్ GPSతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ అవసరం లేకుండానే మీరు వెళ్లే గమ్యాన్ని ట్రాక్ చేస్తుంది. Mi బ్యాండ్ 7 ప్రో కూడా 180 కన్నా ఎక్కువ వాచ్ ఫేస్‌లకు సపోర్టు ఇస్తుంది. ఫిట్‌నెస్ ఫీచర్ల పరంగా.. స్మార్ట్‌బ్యాండ్ 117 వ్యాయామ మోడ్‌లతో వస్తుంది. ఇందులో 14 ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి.

Mi బ్యాండ్ 7 ప్రోలో కొన్ని సాధారణ హెల్త్ ఫీచర్లు రోజంతా హృదయ స్పందన రేటు, రక్తం-ఆక్సిజన్ ట్రాకింగ్, స్లీప్ ట్రాకర్, స్టెప్ కౌంట్, క్యాలరీ కౌంట్ అన్ని ట్రాక్ చేయడంలో సాయపడతాయి. బ్యాటరీ విభాగంలో.. Mi బ్యాండ్ 7 ప్రో 235mAh బ్యాటరీతో వచ్చింది. ఒక్కసారి ఛార్జ్‌పై 12 రోజుల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. కనెక్టివిటీలో వాచ్‌లో బ్లూటూత్ v5.2 కనెక్టివిటీ, NFC సపోర్ట్, Xiao AI వాయిస్ అసిస్టెంట్ ఉన్నాయి. స్మార్ట్ బ్యాండ్ 5ATM వాటర్ రెసిస్టెంట్ డిజైన్‌ కూడా ఉంది.

Read Also : Airtel New Plans : అతి తక్కువ ధరకే ఎయిర్‌టెల్ 4 కొత్త స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ తెలుసా?