అదిరిపోయే ఫీచర్లు : జియోమీ Redmi Go సేల్  .. ధర ఎంతంటే?

అదిరిపోయే ఫీచర్లు : జియోమీ Redmi Go సేల్  .. ధర ఎంతంటే?

సమ్మర్ సీజన్ లో స్మార్ట్ ఫోన్ల సేల్ సందడి జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే హెచ్ఎండీ గ్లోబల్ నోకియా, సౌత్ కొరియా దిగ్గజం శాంసంగ్ సహా పలు మొబైల్ కంపెనీలు తమ కొత్త ప్రొడక్ట్ లను అదిరిపోయే ఫీచర్లతో భారత మార్కెట్లలోకి విడుదల చేశాయి.

అదిరిపోయే ఫీచర్లు : జియోమీ Redmi Go సేల్  .. ధర ఎంతంటే?

సమ్మర్ సీజన్ లో స్మార్ట్ ఫోన్ల సేల్ సందడి జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే హెచ్ఎండీ గ్లోబల్ నోకియా, సౌత్ కొరియా దిగ్గజం శాంసంగ్ సహా పలు మొబైల్ కంపెనీలు తమ కొత్త ప్రొడక్ట్ లను అదిరిపోయే ఫీచర్లతో భారత మార్కెట్లలోకి విడుదల చేశాయి.

సమ్మర్ సీజన్ లో స్మార్ట్ ఫోన్ల సేల్ సందడి జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే హెచ్ఎండీ గ్లోబల్ నోకియా, సౌత్ కొరియా దిగ్గజం శాంసంగ్ సహా పలు మొబైల్ కంపెనీలు తమ కొత్త ప్రొడక్ట్ లను అదిరిపోయే ఫీచర్లతో భారత మార్కెట్లలోకి విడుదల చేశాయి. హెచ్ఎండీ, శాంసంగ్ కంపెనీలకు పోటీగా చైనా మొబైల్ మేకర్ జియోమీ స్మార్ట్ ఫోన్ దిగ్గజం సరికొత్త స్మార్ట్ ఫోన్ Xiaomi Redmi Go విడుదల చేసింది.

మార్చి 22 మధ్యాహ్నం నుంచే సేల్..
Android Go ఎడిషన్ పై రన్ అయ్యే ఈ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లలో రిలీజ్ చేసింది. ఇండియాలో జియోమీ అందించే చౌకైన ధర ఫోన్ రెడ్ మిగో స్మార్ట్ ఫోన్. ఇంతకీ దీని ధర ఎంతో తెలుసా? రూ. 4వేల 499. జియోమీ అధికారిక వెబ్ సైట్, MI Home స్టోర్లు, ఈ కామర్స్ దిగ్గజం Flipkart వెబ్ సైట్ లో మార్చి 22, 2019 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్స్ ప్రారంభం కానుంది. జియోమీ లో బడ్జెట్ ఫోన్లలో ఇదే అతి తక్కువ ధరకు లభిస్తోంది.  
Read Also : పేటీఎం-గూగుల్ పే తరహాలో : జియోమీ ‘MI Pay’ వచ్చేసింది

లేటెస్ట్ సాఫ్ట్ వేర్.. ఆండ్రాయిడ్ గో
జియోమీ ఫీచర్ల ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్లకు టర్న్ అయిన అనంతరం ఎంట్రీ లెవల్ లో అందిస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ కూడా రెడమ్ గో. ఈ ఫోన్ పై గూగుల్ ఆండ్రాయిడ్ గో తో డిజైన్ చేయగా, 512 MB లేదా 1GB RAM అందిస్తోంది. తక్కువ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో Android Go లేటెస్ట్ సాఫ్ట్ వేర్ ను అందుబాటులోకి తేవాలని ఆలోచనతో జియోమీ ముందుకొచ్చింది. రెడ్ మి గో.. యూట్యూబ్, యూట్యూబ్ గో కు చెందిన ట్రిమ్ డౌన్ వర్షన్ పై వేగంగా రన్ అవుతుంది. తక్కువ డేటాను మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. గో ఎడిషన్ యాప్స్ లో గూగుల్ మ్యాప్స్, జీమెయిల్, గూగుల్ అసిస్టెంట్ లు కూడా ఉన్నాయి. 

స్పెషిఫికేషన్లు ఇవే.. 
* 5 అంగుళాల డిసిప్లే 16:9, 720పీ హెచ్ డీ డిసిప్లే
* స్నాప్ డ్రాగన్ 425 చిప్ సెట్
* ఫోర్ కార్టెక్స్ ఎ53 కోర్స్, 1.4ghz
* 1GB RAM, 8GB, 16GB స్టోరేజీ
* హైబ్రిడ్ సిమ్ స్లాట్ 
* సెకండరీ సిమ్ కార్డు 
* మైక్రో ఎస్ డీ కార్డు 
* 8ఎంపీ కెమెరా
* ఎల్ ఈడీ ఫ్లాష్, 5ఎంపీ ఫ్రంట్ సెల్పీ కెమెరా
* 3000ఎంఎహెచ్ బ్యాటరీ 

Read Also : కీబోర్డు చెక్ చేశారా? : వాట్సాప్‌లో ‘ట్రాన్స్‌జెండర్’ ఎమోజీలు

×