Xiaomi Smart Glasses : అద్భుతమైన స్మార్ట్‌ అద్దాలు.. సంగీతం వినొచ్చు, కాల్స్ మాట్లాడొచ్చు

కంటి అద్దాలను కొందరు చూపు సరిగా కనపడటానికి ధరిస్తే, మరికొందరు ఫ్యాషన్ కోసం పెట్టుకుంటుంటారు. అయితే ఫ్యాషన్, టెక్నాలజీని మిళితం చేసిన స్మార్ట్‌గ్లాస్‌లపై యువత ఆసక్తి చూపుతున్నారు.

Xiaomi Smart Glasses : అద్భుతమైన స్మార్ట్‌ అద్దాలు.. సంగీతం వినొచ్చు, కాల్స్ మాట్లాడొచ్చు

Xiaomi Smart Glasses

Xiaomi Smart Glasses : కంటి అద్దాలను కొందరు చూపు సరిగా కనపడటానికి ధరిస్తే, మరికొందరు ఫ్యాషన్ కోసం పెట్టుకుంటుంటారు. అయితే ఫ్యాషన్, టెక్నాలజీని మిళితం చేసిన స్మార్ట్‌గ్లాస్‌లపై యువత ఆసక్తి చూపుతున్నారు. షావోమి కంపెనీ తయారు చేసిన స్మార్ట్‌గ్లాస్‌ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది 51 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఇక డిస్‌ప్లే చిప్‌ బియ్యం గింజ సైజ్‌లో ఉంటుంది.

Read More : Scholarships Scam : ఘరానా మోసం.. స్కాల‌ర్‌షిప్స్ పేరుతో కోటి రూపాయలు వసూలు

ఈ అద్దాలపై నొటిఫికేషన్లు కనిపిస్తాయి. చిరాకు తెప్పించే నోటిఫికెషన్స్ ఏమి రావు. షావోమి ఏఐ అసిస్టెంట్‌ ‘ప్రైమరీ ఇంటరాక్షన్‌ మెథడ్‌’తో హోమ్‌ అలారమ్స్, ఆఫీస్‌ యాప్‌కు సంబంధించిన అర్జెంట్‌ సమాచారం.. ఇలా ముఖ్యమైనవి మాత్రమే మనం కోరినట్లు కనిపిస్తాయి. ఇది నావిగేషన్ చేయగలదు.

ఇక ఇందులో 5ఎంపీ కెమెరా ఉంటుంది. దీంతో వీడియోలు, ఫొటోలు తీసుకోవచ్చు. ఇన్‌బిల్ట్‌ స్పీకర్లతో కాల్స్‌ స్వీకరించవచ్చు. ఆడియోకు టెక్ట్స్‌ రూపం ఇచ్చే ఫీచర్‌ కూడా ఉంది. ఈ ఆడియో టెక్స్ట్ ఫీచర్ చాలామందిని ఆకట్టుకుంటుంది. బిజీగా ఉన్న సమయంలో నోటి మాటతో కావలసిన వారికి సందేశం పంపవచ్చు. ఫేస్‌బుక్,రేబాన్‌ వారి స్మార్ట్‌గ్లాసెస్‌ రేబాన్‌ స్టోరీస్‌. ‘మా ఫస్ట్‌ జెనరేషన్‌ స్మార్ట్‌గ్లాస్‌ ధరిస్తే….ప్రపంచం మీ కళ్ల ముందు ఉంటుంది.

Read More : Ram Gopal Varma : వరంగల్‌లో వర్మ సీక్రెట్ సెర్చింగ్.. వాళ్ల బయోపిక్ గురించేనా..?

యూజర్‌ ప్రైవసీని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్‌గ్లాస్‌లను డిజైన్‌ చేశారు. క్లాసిక్, రౌండ్, లార్జ్‌…ఇలా రేబాన్‌ స్టోరీస్‌లో 20 వేరియంట్స్‌ ఉన్నాయి. స్మార్ట్‌గ్లాస్‌ కదా అని ఇవేమి అసాధారణంగా ఉండవు.. చూడడానికి మామూలు అద్దాలుగానే కనిపిస్తాయి. అయితే, రైట్‌ బిఫోర్‌ యువర్‌ ఐస్‌…ప్రపంచం ప్రత్యక్షమవుతుంది. ఇక షావోమి కంపెనీ స్మార్ట్‌గ్లాస్‌ సెప్టెంబర్ 14న లాంచ్ చేసింది.