Hero Motocorp: హై-టెక్ ఫీచర్‌లతో వస్తున్న అడ్వెంచర్ మోటార్‌సైకిల్ XPULSE 200 4V

E20, OBD-II అనుగుణ్యమైన XPulse 200 4V ని ప్రవేశపెట్టడం అనేది సుస్థిరమైన పద్ధతిలో ప్రీమియం సెగ్మెంట్‌పై మా దృష్టిని బలంగా పునరుద్ఘాటిస్తుంది. XPulse భారతదేశంలో, మా గ్లోబల్ మార్కెట్‌లలో కస్టమర్‌లలో మా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం మోటార్‌సైకిళ్లలో ఒకటిగా వేగంగా మారింది

Hero Motocorp: హై-టెక్ ఫీచర్‌లతో వస్తున్న అడ్వెంచర్ మోటార్‌సైకిల్ XPULSE 200 4V

XPULSE 200 4V: సాంకేతికంగా అధునాతనమైన మొబిలిటీ సొల్యూషన్‌లను తీసుకురావాలనే తన దృఢ నిబద్ధ తకు అనుగుణంగా, ప్రపంచంలోనే మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల అతిపెద్ద తయారీదారు అయిన హీరో మోటో కార్ప్, ఈరోజు సరికొత్త OBD-II, E20 అనుగుణ్యమైన అడ్వెంచర్ మోటార్‌సైకిల్ -XPulse 200 4 Valveని విడుదల చేసింది. 4V E20 అనుగుణ్య ఇంజన్‌తో XPulse 200 వస్తుంది. ఇది 20% వరకు ఇథనాల్-మిశ్రిత గ్యాసోలిన్ మిశ్రమంతో పని చేయగలదు. ఈ మోటార్‌సైకిల్ ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్ (OBD) అనే స్వీయ-నిర్ధారణ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఇది ఏదైనా లోపాలు లేదా పని చేయకపోవడాలను గుర్తించడంలో సహాయపడుతుంది. మాల్ ఫంక్షన్ ఇండికేటర్ లైట్ (MIL) ద్వారా వినియోగదారు దృష్టికి తీసుకువస్తుంది.

TSRTC Reduced Fares : టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఈ-గరుడ ఎలక్ట్రిక్ బస్సు ఛార్జీలు తగ్గింపు

సాహసానికి సిద్ధంగా ఉన్న నవతరం రైడర్ కోసం అన్ని భూభాగాలను జయించేలా రూపొందించబడిన Hero XPulse 200 4V సాహసం, సౌకర్యాల అసమానమైన అనుభవం కోసం మరింత ఆప్టిమైజ్ చేయబడింది. నవీకరించబడిన ఎర్గోనామిక్స్, లైటింగ్ టెక్నాలజీ నుంచి అధునాతన బ్రేకింగ్ మోడ్‌ల వరకు, హీరో X Pulse 200 4V ఇప్పటి వరకూ అన్వేషించబడని వాటిని అన్వేషించడానికి అవసరమైన ప్రతిదాన్నీ అందిస్తుంది. బేస్, ప్రో అనే రెండు వేరియంట్‌లలో ఆవిష్కరించబడిన XPulse 200 4V దేశవ్యాప్తంగా ఉన్న హీరో మోటోకా ర్ప్ డీలర్‌షిప్‌లలో ఆకర్షణీయమైన ధర* రూ. 1,43,516/-(బేస్), రూ. 1,50,891/- (ప్రో) వద్ద అందుబాటులో ఉంది.

Realme 11 Pro Series : వచ్చే జూన్‌లో రియల్‌మి 11 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

హీరో మోటోకార్ప్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ (CGO) రంజీవ్‌జిత్ సింగ్ మాట్లాడుతూ, “E20, OBD-II అనుగుణ్యమైన XPulse 200 4V ని ప్రవేశపెట్టడం అనేది సుస్థిరమైన పద్ధతిలో ప్రీమియం సెగ్మెంట్‌పై మా దృష్టిని బలంగా పునరుద్ఘాటిస్తుంది. XPulse భారతదేశంలో, మా గ్లోబల్ మార్కెట్‌లలో కస్టమర్‌లలో మా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం మోటార్‌సైకిళ్లలో ఒకటిగా వేగంగా మారింది. ఈ మోటార్‌సైకిల్ పర్యావరణ అనుకూల ఎంపికలు చేయడం పట్ల కూడా చక్కటి అవగాహనతో ఉన్న నవతరం అన్వేషకుల అవసరాలను ఇది తీరు స్తుంది. అడ్వెంచర్, ఆఫ్‌రోడ్ థ్రిల్ కోసం వారి ఆకాంక్షలను నెరవేర్చడం ద్వారా కొత్త XPulse 200 4, పని తీరు, కనెక్టివిటీ, సాంకేతికత, స్టైలింగ్.. ఇలా అన్ని కీలక రంగాలలో గణనీయమైన పురోగతితో రైడర్‌ లకు భిన్నమైన అనుభవాన్ని సృష్టించడాన్ని లక్ష్యంగా చేసుకుంది” అని అన్నారు.