ఈ FitBit యాప్.. కరోనావైరస్‌ను డిజిటల్‌గా గుర్తిస్తుంది.. ఎలా పనిచేస్తుందంటే?

  • Published By: sreehari ,Published On : July 27, 2020 / 10:16 PM IST
ఈ FitBit యాప్.. కరోనావైరస్‌ను డిజిటల్‌గా గుర్తిస్తుంది.. ఎలా పనిచేస్తుందంటే?

కరోనా వైరస్ సోకిందో లేదో నిర్ధారణ చేయాలంటే కచ్చితంగా టెస్టింగ్ చేసుకోవాల్సిందే.. సాధారణంగా కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారి నుంచి స్వాబ్, బ్లడ్ శాంపిల్స్ ద్వారా నిర్ధారణ చేస్తారు. ఇప్పుడు డిజిటల్ రూపంలో కరోనాను గుర్తించే కొత్త మొబైల్ యాప్ వచ్చేసింది.

దీన్ని పరిశోధకులు డెవలప్ చేశారు. కోవిడ్ -19 డిజిటల్ గుర్తించాలంటే అవసరమైన డివైజ్ ల్లో స్మార్ట్‌ఫోన్‌ల వాడకాన్ని పరిశోధించడానికి శాస్త్రవేత్తలు దీన్ని వినియోగించనున్నారు. కోవిడ్-కొల్లాబ్ అధ్యయనంలో పాల్గొనేవారికి ఫిట్‌బిట్ డివైజ్‌లను కనెక్ట్ చేస్తారు.

వారిలో హృదయ స్పందన రేటు, యాక్టివిటీ, నిద్రతో సహా డేటాను షేర్ చేయడానికి అనుమతించే ‘Mass Science’ యాప్‌ను పరిశోధన బృందం క్రియేట్ చేసింది. ఇందులో పాల్గొనేవారు… కోవిడ్ -19 లక్షణాలతో పాటు భౌగోళిక స్థానం, మానసిక స్థితి, మానసిక ఆరోగ్యం గురించి సమాచారాన్ని అందిస్తుంది.

కరోనా వ్యాధి పాజిటివ్ అని పరీక్షిస్తే.. రోగ నిర్ధారణను కూడా వినియోగించవచ్చు. కరోనా వైరస్ ఎవరికి సోకింది అనేదానిపై సరైన సమాచారం లేదు. ముఖ్యంగా లక్షణరహితంగా, కోవిడ్ -19 ను గుర్తించడానికి వేరబుల్ డేటాను ఎలా ఉపయోగించవచ్చో పరిశీలిస్తున్నామని UK లోని కింగ్స్ కాలేజ్ లండన్ నుండి స్టడీ లీడ్ రచయిత అమోస్ ఫోలారిన్ చెప్పారు.

వైరస్ వ్యాప్తిని గుర్తించగలిగే చౌకైన నిరంతర డిజిటల్ టెస్టును డెవలప్ చేసాశమని ఫోలారిన్ చెప్పారు. అధ్యయనం ప్రకారం.. యాప్ సహాయంతో కోవిడ్ -19 పాజిటివ్ అని గుర్తించినప్పుడు పరిశోధకులు హృదయ స్పందన రేటు, యాక్టివిటీతో సహా డేటాను విశ్లేషిస్తారు.

అనారోగ్యం సమయంలో డేటాలో తేడాలను పరిశీలిస్తారు. కరోనావైరస్ ముందస్తు హెచ్చరిక సంకేతాల కోసం పొటెన్షియల్ డిజిటల్ పరీక్షను అభివృద్ధి చేశారు. ఒక ఫిట్‌బిట్ వినియోగదారు గతంలో అనారోగ్యంతో లేదా గతంలో కోవిడ్ -19 తో బాధపడినా వారి చారిత్రక డేటాను షేర్ చేయడానికి అధ్యయన యాప్ ఉపయోగించవచ్చు.

ఈ డివైజ్ ద్వారా హృదయ స్పందన రేటుతో పాటు ఫ్లూ లాంటి అనారోగ్యాన్ని గుర్తించవచ్చు. ఈ యాప్ ద్వారా యూజర్లకు SARS-CoV-2 వంటి వైరస్ సోకినప్పుడు హృదయ స్పందన రేటుతో సహా ప్రారంభ లక్షణాలు ఉంటే ముందుగానే హెచ్చరికలను పంపుతుందని పరిశోధకులు అంటున్నారు.