SBI: మీ పాస్‌వర్డే మీ సంతకం.. ఖాతాదారులకు ఎస్‌బీఐ అలెర్ట్?

భద్రంగా ఉండేందుకు మనం ఎన్ని మార్గాల్లో వీలుంటే అన్ని మార్గాల్లో మన బ్యాంకు ఖాతాలను ప్రొటెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మన ఖాతాలు సైబర్ నేరగాళ్లకి దొరకకుండా

SBI: మీ పాస్‌వర్డే మీ సంతకం.. ఖాతాదారులకు ఎస్‌బీఐ అలెర్ట్?

Sbi

SBI: భద్రంగా ఉండేందుకు మనం ఎన్ని మార్గాల్లో వీలుంటే అన్ని మార్గాల్లో మన బ్యాంకు ఖాతాలను ప్రొటెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మన ఖాతాలు సైబర్ నేరగాళ్లకి దొరకకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాల్లో లూప్స్ వెతికే సైబర్ కేటుగాళ్ల నుండి మన బ్యాంక్ ఖాతాలు దొరకకుండా కాపాడేది ముందు మన పాస్ వర్డ్ మాత్రమే. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సర్వీస్ ఏదైనా మీ పాస్ వర్డ్ బలంగా ఉంటే ముందు జాగ్రత్త తీసుకున్నట్లే లెక్క. అయితే, చాలా మందికి ఈ పాస్ వర్డ్ మర్చిపోతామనే భయంతో సులభంగా సెట్ చేసుకోవడమే ఇష్టపడుతుంటారు.

చాలా మంది పాస్‌వర్డ్‌ అనగానే 12345678 వంటి అంకెలు.. abcdefg వరస లెటర్లు పెట్టుకుంటారు. ఇలాంటి పాస్‌వర్డ్‌లు హ్యాకర్ల చేతికి ఈజీగా చిక్కుతాయి. దీంతో పాటు పేరు, పుట్టినతేదీ, కుటుంబసభ్యుల పేర్లు, పుట్టిన సంవత్సరం వంటివి పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటారు. ఇలాంటివి కూడా ఎట్టి పరిస్థితుల్లో పాస్ వర్డ్ గా పెట్టకూడదు. ఎందుకంటే ఇవి సైబర్ నేరగాళ్లు సులభంగా పసిగట్టేస్తారు. ఇలాంటి సులభమైన, ఖాతాదారుడి వివరాలకు సంబంధించిన పాస్ వర్డ్స్ పెట్టుకొనే వారికి స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా అలెర్ట్ ఇచ్చింది.

ఎస్బీఐ ఖాతాదారులు ఎప్పుడైనా క్యాపిటల్‌, స్మాల్‌ లెటర్స్‌ కలిపి ఉండేలా (aBjsE7uG) పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాలని, లేదంటే అక్షరాలు, అంకెలు, సంజ్ఞలు వంటిని కలిపి (AbjsE7uG61!@) పాస్ వర్డ్స్ పెట్టుకోవాలని కోరింది. దీంతో పాటు పాస్‌వర్డ్‌లో కనీసం 8 క్యారెక్టర్స్‌ ఉండేలా చూసుకుంటూ itislocked, thisismypassword వంటి డిక్షనరీకి దొరికే పదాలను వాడకూడదని, కీబోర్డులో వరుసగా ఉండేలా qwerty, asdfg వంటివి ఉండకూడదని సూచించింది. కావాలంటే “:)”, “:/”ఇలా భావోద్వేగాల చిహ్నలను వాడుకోవచ్చని సూచించింది.