YouTube: యూట్యూబ్ యూజర్ల టైం సేఫ్ చేసే ఫీచర్

యూట్యూబ్ బాగా కమర్షియల్ అయిపోయింది. ప్రీమియం యూజర్ల కోసం ప్రత్యేక ఫీచర్లు తీసుకొచ్చింది. ఏ కన్ఫ్యూజన్ లేకుండా, విసుగు పుట్టించకుండా ప్రీమియం యూజర్లను ఎంటర్‌టైన్ చేయాలనుకోవడమే దీని ఉద్దేశ్యం. సాధారణంగా యూట్యూబ్ వీడియోలకు వాడే థంబ్ నైల్స్ బట్టే వీడియోలపై క్లిక్ చేస్తుంటాం.

YouTube: యూట్యూబ్ యూజర్ల టైం సేఫ్ చేసే ఫీచర్

YouTube Channels Blocked

YouTube: యూట్యూబ్ బాగా కమర్షియల్ అయిపోయింది. ప్రీమియం యూజర్ల కోసం ప్రత్యేక ఫీచర్లు తీసుకొచ్చింది. ఏ కన్ఫ్యూజన్ లేకుండా, విసుగు పుట్టించకుండా ప్రీమియం యూజర్లను ఎంటర్‌టైన్ చేయాలనుకోవడమే దీని ఉద్దేశ్యం. సాధారణంగా యూట్యూబ్ వీడియోలకు వాడే థంబ్ నైల్స్ బట్టే వీడియోలపై క్లిక్ చేస్తుంటాం. తీరా ఓపెన్ చేశాక దానికి సంబంధించిన వీడియో లేకపోతే విసుక్కొని యాప్ క్లోజ్ చేసేస్తాం.

ఇలాంటి కన్ఫ్యూజన్ కు చెక్ పెడుతూ మోస్ట్ రీప్లేడ్ ఫీచర్ ను తీసుకురానుంది. ఇన్నిరోజులుగా ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఫీచర్ రెగ్యూలర్ యూజర్లకు కూడా అందుబాటులోకి వస్తుంది. దీనిని బట్టి ఎక్కువ మంది చూసిన పార్ట్ వరకే ప్లే ఆవుతుంది. అలా వీడియో మొత్తం చూడాల్సిన అవసరం లేకుండా, వీడియో గురించి ఎక్స్‌పెక్ట్ చేసిందే మనకు కనిపిస్తుంది.

వీడియోలోని మోస్ట్ రీప్లేడ్ పార్ట్ తెలిసేలా వీడియో పక్కన ప్రోగ్రెసివ్ బార్ ఉంటుంది. దాని సహాయంతో ఎక్కువ మంది చూసిన పార్ట్ తెలుసుకోవచ్చు. ఇప్పటివరకూ ఈ ఫీచర్ మొబైల్, డెస్క్ టాప్ లకు మాత్రమే పరిమితం కాగా, ఇకపై స్మార్ట్ టీవీలు, గేమింగ్ కన్సోల్ లకు కూడా అందించారు.

Read Also: యాడ్స్‌ ఫ్రీ యూట్యూబ్‌ కంటెంట్ ఇకపై చూడలేరు.. ఆ యాప్ రద్దు!

వీటితో పాటు మరికొన్ని అప్ డేట్ లు, ఫీచర్లను తీసుకొస్తున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. వీటిలో కొన్ని కొత్తవి కాగా, మరికొన్నింటి అన్ని డివైజ్ లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. వీడియోలను సబ్ సెక్షన్స్ గా విభజించేందుకు మే2020లో యూట్యూబ్ వీడియో చాఫ్టర్ ఫీచర్ ను పరిచయం చేసింది. దీంతో యూజర్లు వీడియోలని తమకు నచ్చిన పార్ట్ ను ఫార్వార్డ్ చేసుకోవచ్చు.