Fake News : ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే 20 యూట్యూబ్ ఛానెళ్లు.. 2 వెబ్‌సైట్లపై నిషేధం..!

భారతదేశంలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లు, రెండు వెబ్ సైట్లపై కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. సున్నితమైన అంశాలపై తప్పుడు సమాచారాన్ని బ్యాన్ చేసింది.

Fake News : ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే 20 యూట్యూబ్ ఛానెళ్లు.. 2 వెబ్‌సైట్లపై నిషేధం..!

Youtube Channels, Websites Spreading Anti India Propaganda, Fake News Ordered To Be Blocked By I&b Ministry

Anti-India Propaganda : భారతదేశంలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లు, రెండు పాకిస్తాన్ వెబ్ సైట్లపై కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. దేశంలో సున్నితమైన అంశాలపై తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్న 20 యూట్యూబ్ ఛానళ్లు, రెండు పాకిస్తానీ వెబ్ సైట్లను బ్యాన్ చేసినట్టు  ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ  యూట్యూబ్ ఛానళ్లు పాకిస్థాన్ వేదికగా పనిచేస్తున్నాయని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఏజెన్సీ సమాచారంతో కేంద్ర మంత్రిత్వ శాఖ ఆయా ఛానళ్లు, వెబ్ సైట్లపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో సున్నితమైన అంశాల విషయంలో రెచ్చగొట్టేలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించడంతో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయాన్ని వెల్లడించింది.

బ్యాన్ చేసిన యూట్యూబ్ ఛానళ్లు, వెబ్‌సైట్‌లు పాకిస్తాన్ సపోర్ట్‌తో పనిచేస్తున్నాయని తేలింది. గుర్తు తెలియని నెట్ వర్క్‌కు సంబంధించినదిగా I&B మినిస్ట్రీ గుర్తించింది. దేశంలో ప్రస్తుత సున్నితమైన అంశాల గురించి ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నాయని  గుర్తించారు. యూట్యూబ్ ఛానెళ్ల నెట్‌వర్క్‌తో  ఓ నయా పాకిస్తాన్  గ్రూప్  భారత్’కు వ్యతిరేకంగా తప్పుడు సమాచారం ప్రచారాన్ని ప్రసారం చేస్తోంది. ఇండియన్ ఆర్మీ,  కశ్మీర్, మైనార్టీ కమ్యూనిటీస్, జనరల్ బిపిన్ రావత్, రామాలయం వంటి సున్నితమైన అంశాలపై తప్పుడు వార్తలను ప్రచారానికి ఈ ఛానెళ్లను వినియోగిస్తున్నారని  ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది.

నయా పాకిస్తాన్ గ్రూప్ నుంచి నిర్వహిస్తున్న ఇతర ఛానళ్లు, వెబ్ సైట్లతో పాటు ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్న మరికొన్ని ఇండిపెండెంట్ యూ ట్యూబ్ ఛానళ్లను కూడా బ్లాక్ చేసింది. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే యూట్యూబ్ ఛానళ్లకు 35 లక్షల స్కబ్ స్క్రైబర్లు ఉన్నారని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ లో మొన్నటివరకు జరిగిన రైతుల నిరసనలపై కంటెంట్‌ను పోస్ట్ చేయడం, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రచార చేస్తున్న పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్‌లు ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేశాయి. భారతదేశంలోని మైనారిటీలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్టు నివేదికలు వెల్లడించాయి.

Read Also : Omicron Cases : తమిళనాడులో ఒక్కరోజే 33 ఒమిక్రాన్ కేసులు నమోదు