యూ ట్యూబ్ సెన్సార్ కట్ : లక్ష వీడియోలు డిలీట్

  • Published By: madhu ,Published On : September 4, 2019 / 02:33 PM IST
యూ ట్యూబ్ సెన్సార్ కట్ : లక్ష వీడియోలు డిలీట్

మంచి కన్నా చెడుకు సంబంధించిన వీడియోలు అప్ లోడ్ అవుతుండడంపై యూ ట్యూబ్‌ దృష్టి సారించింది. చెత్తను తొలగించే పనిలో పడ్డారు నిర్వాహకులు. సెన్సార్ కటింగ్‌లాగా వీడియోలను డిలీట్ చేసేస్తోంది. 17 వేల యూ ట్యూబ్ ఛానెళ్లకు సంబంధించి లక్ష వీడియోలను డిలీట్ చేసినట్లు యూ ట్యూబ్‌కు చెందిన ప్రతినిధి వెల్లడించారు. డిలీట్ చేసిన వీడీయోలు..ఇతరుల మనోభావాలు కించపరిచే విధంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ప్రతి మూడు నెలలకొకసారి యూ ట్యూబ్ నిర్వాహకులు రివ్యూ నిర్వహిస్తున్నారు. పనికిమాలిన, రెచ్చగొట్టినా, మనోభావాలు దెబ్బతినే విధంగా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వీడియోలను తొలగిస్తున్నారు. అంతేకాదు..యూ ట్యూబ్ ఛానెళ్లను సైతం డిలీట్ చేసేస్తోంది. 

వీడియోలు అప్ లోడ్ చేసే విషయంలో నిబంధనలు కఠినతరం చేస్తోంది యూ ట్యూబ్. సోషల్ మీడియాలో యూ ట్యూబ్ దూసుకెళుతోంది. దీని క్రెడిట్ అంతా ఇంత కాదు. న్యూస్, ఎంటర్ టైన్ మెంట్, కామెడీ ఇలా వివిధ రంగాలకు చెందిన వారు యూ ట్యూబ్ ఛానెళ్లు ఓపెన్ చేసి వీడియోలను అప్‌లోడ్ చేస్తుంటారు. ఔత్సాహికులకు మంచి వేదికలా నిలుస్తోంది. క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్లు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. చాలా మంది వీడియోలు అప్ లోడ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఇందులో చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకున్నారు.