Youtube కొత్త హోంపేజీ ఇదే : వీడియోలపై లాంగ్ టైటిల్స్ , బిగ్ తంబునైల్స్ 

  • Published By: sreehari ,Published On : November 11, 2019 / 07:57 AM IST
Youtube కొత్త హోంపేజీ ఇదే : వీడియోలపై లాంగ్ టైటిల్స్ , బిగ్ తంబునైల్స్ 

మీరు యూట్యూబ్ యూజర్లా . మీ యూట్యూబ్ ఛానల్ ఉందా? అయితే మీ యూట్యూబ్ హోంపేజీ మారిపోయింది. రీడిజైన్ తో పాటు సరికొత్త మార్పులు చేసింది సంస్థ. ఇకపై ఆండ్రాయిడ్, డెస్క్ టాప్, ఐఓఎస్ యాప్ ల్లో యూట్యూబ్ కొత్త డిజైన్ కనిపించనుంది. ఇందుకోసం యూట్యూబ్ కొత్త ఫీచర్ అప్‌డేట్ తీసుకొచ్చింది. దీంతో మీ యూట్యూబ్ హోంపేజీలో పెద్ద తంబునైల్స్, లాంగ్ వీడియో టైటిల్స్ గా మారిపోయాయి. మీ యూట్యూబ్ ఛానళ్లలో కూడా కొత్త డిజైన్ ఫీచర్ అప్ డేట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఇకపై మీ వీడియోల తంబునైల్స్ అన్ని పెద్దవిగా కనిపిస్తాయి. వీడియో లాంగ్ టైటిల్స్ కనిపిస్తాయి. 

ఇప్పటివరకూ రెండు వరుసలో కనిపించే వీడియోలన్నీ ఒకటిగా మారిపోయాయి. వీడియో టైటిల్స్ కూడా ఇప్పుడు హోంపేజీపై ఎక్కువ స్పేస్ తో పెద్దవిగా కనిపించనున్నాయి. యూజర్లు నేరుగా సులభంగా యాక్సస్ చేసుకునేలా యూట్యూబ్.. వీడియో టైటిళ్లతో ఛానల్ ఐకాన్ యాడ్ చేసింది. పెద్దగా ఉండే వీడియో తంబునైల్స్ కోసం ఎక్కువ స్పెస్ ఇచ్చింది. హోంపేజీలో కనిపించే కొంత కంటెంట్ ను యూట్యూబ్ పక్కన పెట్టేసింది. కొన్ని వీడియో genersను యూట్యూబ్ హోంపేజీలో బ్రేకింగ్ న్యూస్, మ్యూజిక్ మిక్సెస్ మాదిరిగా కనిపిస్తాయి. అంతేకాదు.. రీడిజైన్‌తో పాటు ‘add to queue’ అనే షార్ట్ కట్ కూడా యాడ్ చేస్తోంది. 

ఇక నుంచి యూజర్లు తమ వీడియోలను డెస్క్‌టాప్‌పై తంబునైల్స్ నుంచి queueకు నేరుగా Add చేసుకోవచ్చు. అంతకుముందు బ్రౌజర్ క్లోజ్ చేస్తే  వీడియోలను queueలో సేవ్ అయ్యేవి కావు. యూట్యూబ్ డెస్క్ టాప్ పై మరో ఫీచర్ రాబోతోంది. ఇప్పటికే యూట్యూబ్ మొబైల్ యాప్స్ పై ప్రవేశపెట్టింది. యూట్యూబ్ లో Don’t recommend channel అనే ఫీచర్ డెస్క్ టాప్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. 

ఈ ఫీచర్ Suggested వీడియోలపై అందుబాటులో ఉంది. మూడు (…) మెనూ సెలెక్ట్ చేయడం ద్వారా యూజర్లు ఈ ఫీచర్ యాక్సస్ చేసుకోవచ్చు. త్వరలో డెస్క్ టాప్, టాబ్లెట్స్ డివైజ్ లపై కూడా topics selection అనే కొత్త అప్ డేట్ రానుంది. యూట్యూబ్ రీడిజైన్ ద్వారా వీడియోల క్వాలిటీ మరింత స్పష్టతగా కనిపించనుంది. పెద్ద పరిమాణంలో వీడియో తంబునైల్స్ ఉండట కారణంగా హోంపేజీపై ఎక్కువ మొత్తంలో వీడియోలు కనిపించే అవకాశం ఉండదు. ఈ రీడిజైన్ పై కొంతమంది యూట్యూబ్ యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.