Tehsildar burnt alive in Telangana: land ISSUE behind her ghastly murder

తహసీల్దార్‌ విజయారెడ్డిని అందుకే చంపాను: రైతు సురేష్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ రాష్ట్ర రాజధాని శివారులో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్‌మెట్‌లో పట్టపగలే తహసీల్దార్‌ చెరుకూరి విజయారెడ్డిని హత్య చేశాడు సురేష్ అనే రైతు. వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వలేదనే కోపంతోనే ఎమ్మార్వోను సజీవ దహనం చేసినట్లు నిందితుడు సురేష్ వెల్లడించాడు.

ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేష్  వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు పోలీసులు. అరవై శాతం కాలిన గాయాలతో ఉన్న సురేష్.. మొదట తనపై కిరోసిన్‌ పోసుకుని, తర్వాత ఆమెపై పోసినట్లు చెప్పుకొచ్చాడు. తనకు నిప్పు అంటించుకుని విజయా రెడ్డిని పట్టుకున్నట్లు వెల్లడించాడు సురేష్.

బాచారంలోని 412 ఎకరాల భూమి డెబ్బై ఏళ్లుగా వివాదాల్లో ఉంది. మహారాష్ట్రకు చెందిన రాజా ఆనందరావు పేరిట ఉన్న ఈ భూమిలో 130 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం భూప్రక్షాళన అనంతరం అతడు తమకు విక్రయించాడని సయ్యద్‌ యాసిన్‌ వారసులు తెరపైకి వచ్చారు. అయితే వివాదంలో ఉన్న ఆ భూమిని పలు కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయి. ఇందులో నిందితుడు సురేష్‌ కుటుంబం కూడా ఉంది.

ఈ క్రమంలోనే తమకు చెందిన భూమిని వేరొకరికి బదిలీ చేశారంటూ రైతు కుటుంబాలు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కాగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో ఈ భూమి ఉండటంతో కబ్జాదారులు దీనిని దక్కించుకునేందుకు పథకం పన్నారు. ఈ భూకబ్జాలో పలువురు రాజకీయ నేతల హస్తం కూడా ఉందని అంటున్నారు. ఈ భూమి వివాదంలోనే ఆమెను రైతు సురేష్ చంపారు. ఈ భూమి విలువ రూ. 40కోట్లు అని తెలుస్తుంది.

Related Posts