Tej Pratap Yadav contest on Chandrika Roy

లాలూ ఫ్యామిలీలో రగడ : పిల్లనిచ్చిన మామపైనే పోటీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బీహార్‌ : ఆర్జేడీ పార్టీలో గంద‌ర‌గోళం నెల‌కొంది. ఆ పార్టీని వీడిన‌ట్లు తేజ్ ప్ర‌తాప్ యాద‌వ్ ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఆర్జేడీ పొత్తులో భాగంగా స‌ర‌న్ లోక్‌స‌భ స్థానాన్ని చంద్రికా రాయ్‌కు కేటాయించింది. సోద‌రుడు తేజ‌స్వి యాద‌వ్‌తో దూరంగా ఉంటున్న తేజ్ ప్ర‌తాప్.. లోక్‌స‌భ‌కు ఇండిపెండెంట్‌గా పోటీ చేయాల‌నుకుంటున్నారు. స‌ర‌న్ స్థానం నుంచే పోటీకి సిద్ధం అయ్యాడు.

స‌ర‌న్ నుంచి ఆర్జేడీ అభ్య‌ర్థిగా పోటీ ప‌డుతున్న చంద్రికా రాయ్ అల్లుడే తేజ్ ప్ర‌తాప్‌. పిల్లనిచ్చిన మామ. మాజీ మంత్రి చంద్రికా కుమార్తె ఐశ్వ‌ర్య‌ను తేజ్‌ప్ర‌తాప్ వివాహం చేసుకున్నారు. కొన్ని రోజుల‌కే భార్యతో బ్రేక‌ప్ అయ్యింది. విడాకుల కోసం తేజ్ ప్రతాప్ ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. 

తేజస్వి యాద‌వ్ లోక్‌స‌భలో పోటీప‌డే స్థానాల‌ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఆర్జేడీ ఈసారి 19 లోక్‌స‌భ స్థానాల్లో పోటీ చేయ‌నుంది. బ‌గ‌ల్‌పుర్‌, బంకా, మ‌దేపురా, ద‌ర్బంగా నుంచి బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్ మొత్తం 9 స్థానాలలో పోటీ చేస్తోంది. మాదేపురా స్థానం నుంచి శ‌ర‌ద్ యాద‌వ్ కూడా పోటీ చేయ‌నున్నారు.
 

Related Posts