Tejasswi Prakash's WhatsApp hacked: He is using my account to make vulgar video calls

వీడియో కాల్స్ చూసి షాక్ : TV నటి వాట్సాప్ అకౌంట్ హ్యాక్ 

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బుల్లితెర నటి తేజస్వీ ప్రకాశ్ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయింది. తన అకౌంట్ ద్వారా అసభ్యకరమైన వీడియో కాల్స్ హ్యాకర్ పంపిస్తున్నట్టు తేజస్వీ ఆరోపించింది. తన వాట్సాప్ కాంటాక్టుల్లోని వారి వాట్సాప్ అకౌంట్లకు కూడా స్నేహపూర్వకంగా హ్యాకర్ వీడియో లింకులను షేర్ చేస్తున్నాడని తెలిపింది. వారి అకౌంట్లకు పంపిన లింక్ కోడ్ ను అదే అకౌంట్‌కు తిరిగి పంపమని రిక్వెస్ట్ పెట్టినట్టు చెప్పింది. వారంతా తానే లింక్ పంపినట్టు భావించి ఆయా కోడ్ లను తిరిగి పంపడంతో వారి వాట్సాప్ అకౌంట్లను కూడా హ్యాకర్ హ్యాకింగ్ చేసినట్టు తేజస్వీ చెప్పింది. 

ఒకసారి అతడు చేసిన వీడియో కాల్ ఆన్సర్ చేశాక.. ఒక వ్యక్తి న్యూడ్‌గా కనిపించి అసభ్యకరమైన రీతిలో వెకిలిచేష్టలు చేస్తాడని ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించింది. ‘కలర్స్ టీవీలో స్పెషల్ ఎపిసోడ్ కోసం మీరా రోడ్ లో షూటింగ్ తో బిజీగా ఉన్నాను. సెట్ లో ఉండగా.. ఆకస్మాత్తుగా నా వాట్సాప్ అకౌంట్ కు వీడియో కాల్ వచ్చింది. నా పక్కనే చాలామంది ఉన్నారు. నేను ఆ వీడియో కాల్ ఆన్సర్ చేశాను. ఆ వీడియోలో ఓ న్యూడ్ గా ఉన్న వ్యక్తిని చూశాను. అది చూడగానే నాకు వణుకుపుట్టింది. షాక్ అయ్యాను.. ఎంత అసభ్యంగా ఉందో మాటల్లో చెప్పలేను’ అని తెలిపింది. 

టెలివిజన్ ఇండస్ట్రీలోని తన తోటి నటులకు కూడా ఇలాంటి డర్టీ వీడియో కాల్స్ వచ్చినట్టు తేజస్వీ చెప్పుకొచ్చింది. ‘నాతోటి నటుల్లో కరిష్మా తన్నా, తన్యా శర్మ సహా ఇతర నటుల నుంచి నాకు కాల్స్ వచ్చాయి. వారంతా షాక్ అయినట్టు చెప్పారు. నటిగా కంటే ముందు నేను ఒక అమ్మాయిని, ఇలాంటి అసభ్యకరమైన వీడియో కాల్స్ రావడం చూసి నా స్నేహితులైతే అర్థం చేసుకుంటారు. కానీ, నాకు పెద్దగా తెలియని, నాతో కలిసి పనిచేసేవాళ్లకు నాపై చెడు అభిప్రాయం కలిగే అవకాశం ఉంటుంది కదా’ అని తేజస్వీ ఆవేదన వ్యక్తం చేసింది.

నా వాట్సాప్ అకౌంట్ హ్యాక్ చేసిన వ్యక్తిపై సైబర్ క్రైమ్ సెల్ కు కంప్లయింట్ చేశాను. దగ్గరలోని ఏదైనా పోలీసు స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ రిజిస్టర్ చేయమని అడిగారు. కానీ, రాత్రి 3 గంటల నుంచి షూటింగ్ తో బిజీగా ఉన్నాను. ఆ సమయంలో పోలీసుల దగ్గరకు వెళ్లలేకపోయాను. అతి త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నాను’ అని చెప్పింది. టీవి నటి తేజస్వీతో పాటు ఆమె సహా నటి వాట్సాప్ అకౌంట్ కూడా హ్యాక్ అయింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Shadi ho toh aisi ❤️ . . Outfit @kalkifashion

A post shared by Tejasswi Prakash (@tejasswiprakash) on

Related Posts