అన్యాయంగా చంపేశాడు.. నా కూతురు ఎవరిని ప్రేమించలేదు.. పెళ్లి చేసుకోలేదు!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Tejaswini Murder Case : విజయవాడ ప్రేమోన్మాది ఘటనలో హత్యకు గురైన దివ్య తేజస్విని మృతదేహానికి జీజీహెచ్‌లో పోస్టుమార్టం పూర్తి అయింది. తేజస్విని శరీరంపై 13 కత్తిగాట్లు ఉన్నాయని వైద్యులు పోస్టుమార్టం నివేదికలో గుర్తించారు. గొంతుకు లోతుగా కత్తి గాయం కావడం వల్లే మృతిచెందినట్టు వైద్యులు నివేదికలో తెలిపారు.పోస్టుమార్టం పూర్తి.. స్వగృహానికి తేజస్విని మృతదేహం :
పోస్టుమార్టం అనంతరం విజయవాడలోని స్వగృహానికి తేజస్విని మృతదేహాన్ని తరలించారు. దివ్య మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. తన బిడ్డను దారుణంగా హత్య చేసిన నిందితుడు నాగేంద్రను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. విజయ వాడలో రెచ్చిపోయిన ప్రేమోన్నాది నాగేంద్ర.. బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్వినిపై దాడి చేసి గొంతు కోశాడు.తీవ్రగాయాలపాలైన తేజస్విని చికిత్స పొందుతూ మృతిచెందింది. అనంతరం తాను కూడా కత్తితో పొడుచుకుని నాగేంద్ర ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో నాగేంద్రకు చికిత్స పొందుతున్నాడు.

నా కూతురు గొంతు కోసి చంపేశాడు.. తేజస్విని తల్లి ఆవేదన :
తన కూతుర్ని అన్యాయంగా చంపేశాడని తేజస్విని తల్లి బోరున విలపిస్తోంది. తన కూతురు ఎవరినీ ప్రేమించలేదని, పెళ్లి చేసుకోలేదని తల్లి కుసుమ వాపోయింది. ఇంట్లో పడుకున్న తన కూతురి గొంతుకోసి చంపేశాడని కుసుమ తల్లడిల్లిపోయింది.నాగేంద్రకు తేజస్వినికి పెళ్లి జరిగిందని నాగేంద్ర సోదరుడు నాగరాజు చెప్పాడు. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని నాగరాజు పోలీసులకు తెలిపాడు. పోలీసులతో మాట్లాడుతుండగానే నాగేంద్ర స్పృహ కోల్పోయాడు.

నిందితుడు నాగేంద్రపై ఐపీఎస్ 302 కింద కేసు నమోదు చేశారు. నాగేంద్ర కండీషన్ సీరియస్ గా ఉందని జీజీహెచ్ వైద్యులు తెలిపారు. బీపీ డౌన్ లో ఉంది.. అదుపులోకి వచ్చాక సర్జరీ చేస్తామని వైద్యులు వెల్లడించారు.

Related Posts