Telangana CM KCR Dubai Tour KCR Attend Investor's Meet | 10TV

పెట్టుబడుల కోసం : కేసీఆర్ దుబాయి టూర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విదేశీ పర్యటన చేయనున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ జనవరి 6 నుండి 13 వరకు దుబాయి, యూఏఈల్లో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారైంది. పెట్టుబడిదారుల సదస్సుకు హాజరయ్యేందుకు ఆయన వెళుతున్నారు. ఆయనతో పాటు ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఆర్వింద్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేవ్ రంజన్, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ వెళ్లనున్నారు. అధికారిక హోదాల్లో పర్యటనకు వెళ్లేలా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరితో పాటు పలువురు ఎంపీలు..ఎమ్మెల్యేలు కూడా వెళ్లనున్నారు. 
విదేశీ పర్యటనకు వెళ్లే ఉన్నతాధికారుల బాధ్యతలను తాత్కాలికంగా ఇతర అధికారులకు అప్పగిస్తూ జనవరి 04వ తేదీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

Related Posts