హైదరాబాద్ లాక్‌డౌన్‌పై ఎల్లుండే సీఎం ప్రకటన

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హైదరాబాద్ లో 15రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది. జులై 1న జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటమే దీనికి కారణం. ఎల్లుండి జులై 1న జరిగే క్యాబినెట్ భేటీలో దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ తుది నిర్ణయాన్ని ప్రకటిస్తారు.

కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి మాస్క్ లు, కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో వైరస్ వ్యాప్తి ఊపందుకుంది. వాతావరణంలో మార్పులు వైరస్ ను ప్రభావితం చేస్తుంది. కేసులు ఇలాగే పెరిగితే పరిస్థితి చేయి దాటిపోతుందని అధికారులు భావిస్తున్నారు. 15రోజులు లాక్ డౌన్ విధించి ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.

వారం రోజుల్లో హైదరాబాద్ వ్యాప్తంగా 50వేల టెస్టులు చేయాలని భావించిన తెలంగాణ సక్సెస్ అయినట్లే కనిపిస్తుంది. హోం మంత్రి నివాసముంటున్న చార్మినార్ పరిధిలోనూ భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.

సికింద్రాబాద్ జోన్ పరిధిలో 2242
ఖైరాతబాద్ జోన్ పరిధిలో 3631
చార్మినార్ జోన్ పరిధిలో 3274
ఎల్బీనర్ జోన్ పరిధిలో 732
కూకట్ పల్లి జోన్ పరిధిలో 498
శేరిలింగంపల్లి జోన్ పరిధిలో 720

లాక్ డౌన్ ఈ సమయంలో అమలు చేయడమే కీలకం అని చాలా వర్గాలు చెబుతున్నారు. ప్రభుత్వం చేయాలనుకుంటున్న టెస్టుల సంఖ్య పెంచాలని విశ్లేషకులు అంటున్నారు.

Read:ఆక్సిజన్ అందక చెస్ట్ ఆసుపత్రిలో కరోనా రోగి మృతి, క్లారిటీ ఇచ్చిన మంత్రి ఈటల