సుప్రీంకోర్టుకు తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్, బాణాసంచాపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Telangana Crackers Association : తెలంగాణ రాష్ట్రంలో క్రాకర్స్ అమ్మకాలపై నిషేధం విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ మండిపడుతోంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ…సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. పండుగకు రెండు రోజుల ముందు నిషేధం విధిస్తే..కోట్లలో నష్టపోతామని వెల్లడిస్తోంది. వెంటనే నిషేధాన్ని ఎత్తివేయాలని, హైకోర్టు తీర్పు వల్ల…చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారని తెలిపింది.దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాలుస్తుంటారనే సంగతి తెలిసిందే. కానీ..ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తుండడం, కాలుష్యం అధికమౌతుండడంతో ప్రజల ఆరోగ్యాలు మరింత దెబ్బతింటాయనే ఆందోళన వ్యక్తమౌతోంది. దీంతో పలు రాష్ట్రాలు క్రాకర్స్ కాల్చడాన్ని బ్యాన్ చేశాయి. ఉత్తరాదిన 7 రాష్ట్రాలు టపాసుల విక్రయం, వాడకంపై నిషేధం విధించాయి. ఢిల్లీలో నవంబర్ 7 నుంచి నవంబర్ 30వరకు నిషేధం అమల్లో ఉంటుంది.దీపావళి పండుగ సందర్భంగా కాల్చే బాణాసంచాతో కాలుష్యం మరింత పెరిగి..శ్వాసకోశ సమస్యలతో రోగులు ఇబ్బందులు పడుతారంటూ..దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారించి..పై విధంగా నిర్ణయం తీసుకుంది. క్రాకర్స్‌ బ్యాన్‌ చేయాలంటూ న్యాయవాది ఇంద్రప్రకాశ్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. క్రాకర్స్‌ను కాల్చడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్‌లో తెలిపారు.టపాసుల కారణంగా కాలుష్యం పెరిగి… కరోనా బాధితులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, శ్వాస కోశ ఇబ్బందులు తలెత్తుతాయని కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు క్రాకర్స్‌పై ఇప్పటికే బ్యాన్‌ విధించిందని… పలు రాష్ట్రాల హైకోర్టులు కూడా ఇప్పటికే నిషేధించాయనే విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా చర్యలు తీసుకోవాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. ఇప్పటికే తెరిచిన షాపులను వెంటనే మూసివేయడంతో పాటు ఎవరైనా క్రాకర్స్‌ అమ్మితే కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై బాణాసంచా వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండుగకు రెండు రోజుల ముందు టపాసులు బ్యాన్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంపై ఆందోళన చెందుతున్నారు. ఆ విషయం ముందే చెబితే తాము కోట్ల రూపాయలు పెట్టి సరుకు తెచ్చేవాళ్లం కాదంటున్నారు. మరి సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Related Tags :

Related Posts :