టి.ఎంసెట్ 2020 ఫలితాలు..విద్యార్థుల్లో ఉత్కంఠ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

telangana-eamcet-2020-results : తెలంగాణ ఎంసెట్ పరీక్షల ఫలితాలు కొద్ది గంటల్లో విడుదల కానున్నాయి. దీంతో పరీ రాసిన విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. 2020, అక్టోబర్ 06వ తేదీ మంగళవారం ఫలితాలను విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ వెల్లడించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎంసెట్ పరీక్ష కూడా పడింది. పరీక్ష నిర్వాహణ చాలా ఆలస్యమైంది. గత నెల సెప్టెంబర్ లో నాలుగు రోజుల పాటు రెండు సెషన్లలో పరీక్షను నిర్వాహించిన సంగతి తెలిసిందే.లక్ష 43 వేల 165 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ, ఏపీలో 102 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చన్నారు. ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ సబ్‌మిట్ చేసి రిజల్ట్స్ చూసుకోవచ్చన్నారు.
మరోవైపు కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఖరారు చేశారు. అక్టోబర్ 09వ తేదీ నుంచి 17 వరకు ఆన్ లైన్ లో స్లాట్ల నమోదు చేసుకోవచ్చు.అక్టోబర్ 12 నుంచి 18వ తేదీ వరకు అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన.
అక్టోబర్ 12వ తేదీన నుంచి 20 వరకు ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్ల ఎంపిక.
అక్టోబర్ 22వ తేదీన మొదటి విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు.అక్టోబర్ 29వ తేదీ నుంచి ఎంసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ.
అక్టోబర్ 30వ తేదీన తుది విడత ధ్రువపత్రాల పరిశీలన.
అక్టోబర్ 30, 31 తేదీల్లో తుది విడుత ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు ఇచ్చే అవకాశం.
నవంబర్‌ 2న ఇంజినీరింగ్‌ తుది విడుత సీట్ల కేటాయింపు.

Related Tags :

Related Posts :