లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Education and Job

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల, తొలి 10 ర్యాంకులు అబ్బాయిలవే

Published

on

telangana eamcet results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంజినీరింగ్ లో 75.29 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ లో తొలి పది ర్యాంకులు అబ్బాయిలే సాధించారు. వారణాసి సాయితేజకు ఫస్ట్ ర్యాంకు వచ్చింది. యశ్వంత్ సాయి సెకండ్ ర్యాక్, మణివెంకట కృష్ణ థర్డ్ ర్యాంకు సాధించారు.

కౌశల్ కుమార్ రెడ్డి 4వ ర్యాంకు, రాజ్ పాల్ 5వ ర్యాంకు, నితిన్ సాయి 6వ ర్యాంకు, కృష్ణ కమల్ 7వ ర్యాంకు, సాయివర్దన్ 8వ ర్యాంకు, వి.సాయి పవన్ 9వ ర్యాంకు, వారణాసి వచన్ సిద్ధార్థ్ 10వ ర్యాంకు సాధించారు. కాగా, కరోనా సోకి ఎంసెట్ పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు అక్టోబర్ 8న పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

మంగళవారం(అక్టోబర్ 6,2020) హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జేఎన్‌టీయూహెచ్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేశారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం నాలుగు రోజులపాటు ఆన్‌లైన్‌ ద్వారా అధికారులు ఈ పరీక్షలు నిర్వహించారు. ఇందుకోసం మొత్తం 102 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అందులో 79 తెలంగాణలో, 23 పరీక్షా కేంద్రాలు ఏపీలో ఉన్నాయి.

మొత్తంగా పరీక్షకు లక్షా 19వేల 183 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 89వేల 734 మంది ఉత్తీర్ణులైనట్లు మంత్రి తెలిపారు.

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌:
ఫస్ట్ ర్యాంకు: సాయితేజ
సెకండ్ ర్యాంకు: యశ్వంత్‌ సాయి
థర్డ్ ర్యాంకు: తమ్మని మణివెంకట కృష్ణ

తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ సోమవారం ఖరారైంది. అక్టోబర్ 9 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్ల నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ నెల 12 నుంచి 18 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలించనున్నారు. ఈ నెల 12 నుంచి 20 వరకు ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లను విద్యార్థులు ఎంచుకోవల్సి ఉంటుంది. 22న మొదటి విడత ఇంజినీరింగ్‌ సీట్లను కేటాయించనున్నారు. 29 నుంచి ఎంసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరుగనుంది. 30న తుది విడత ధ్రువపత్రాల పరిశీలిస్తారు. అక్టోబర్ 30, 31 తేదీల్లో తుది విడుత ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. నవంబర్‌ 2న ఇంజినీరింగ్‌ తుది విడుత సీట్ల కేటాయిస్తామని కన్వీనర్ వివరించారు. స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *