ప్రైవేట్ స్కూళ్లపై తెలంగాణ విద్యా శాఖ సీరియస్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రైవేట్ స్కూళ్లపై తెలంగాణ విద్యా శాఖ సీరియస్. గ్రేటర్ పరిధిలోని 3వేల 500కు పైగా స్కూళ్లకు నోటీసులు ఇచ్చింది. అనుమతుల్లేకుండా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారని సీరియస్ అయింది. అంతేకాకుండా ఇష్టారాజ్యంగా ఫీజులు దండుకుంటున్నారని పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్, వికారాబాద్, రంగారెడ్డి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు రీజనల్ డైరక్టర్ నోటీసులు ఇచ్చారు.

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూళ్లో ఆన్‌లైన్ క్లాసులకు ఫీజులు వసూలు చేస్తున్న విషయం బయటపడింది. దీంతో ప్రైవేట్ స్కూళ్లపై ఫోకస్ పెట్టిన వికారాబాద్ కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లకు నోటీసులు ఇచ్చారు. విద్యాశాఖ అనుమతి లేనిదే ఇష్టారాజ్యంగా ఆన్ లైన్ క్లాసులు నిర్వహించడానికి వీల్లేదు. వీటిని పెడచెవిన పెట్టిన వారిపై విద్యాశాఖ సీరియస్ అయి యాక్షన్ తీసుకునేందుకు రెడీ అంటోంది.

Related Posts