Telangana Government Gurukulam Recruitment

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌ న్యూస్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించింది. 119 బీసీ గురుకుల పాఠశాలల్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3వేల 689 పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జేఎల్, టీజీటీ పోస్టులతో పాటు పలు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేశారు. వీటిటో పాటు గురుకులాల్లో 595 ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగాలను కూడా త్వరలోనే భర్తీ చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్లలో పోస్టుల భర్తీకి పర్మిషన్ ఇచ్చారు.

 

ప్రతి నియోజకవర్గంలో గురుకులం ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం సమయంలో హామీ ఇచ్చారు. ఆ హామీని ఇప్పుడు నెలబెట్టుకున్నారు. ఇందులో భాగంగా 119 గురుకుల పాఠశాల ఏర్పాటుకు ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే విధంగా 119 గురుకులాల్లో స్టాఫ్‌ రిక్రూట్‌మెంటుకు సంబంధించి క్లియరెన్స్ ఇచ్చింది. ప్రిన్సిపాల్స్, గ్రాడ్యుయేట్ టీచర్లు, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు, జూనియర్ లెక్చరర్లు, ఫిజకల్ డైరెక్టర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, స్టాఫ్ నర్సులు, సీనియర్ అసిస్టెంట్ల పోస్టులు భర్తీ చేయనున్నారు.

 

 

* 1,071 టీజీటీ పోస్టులు
* 833 జేఎల్
* 119 పీజీటీ
* 199 ప్రిన్సిపాల్ పోస్టులు
* 119 పీజికల్ డైరెక్టర్స్
* 199 పీఈటీ
* 199 లైబ్రేరియన్ పోస్టులు
* క్రాఫ్ట్ స్టాఫ్‌నర్స్-119, సీనియర్ అసిస్టెంట్-119, జూనియర్ అసిస్టెంట్స్-119 సోస్టులు మంజూరు
* 2019-20 విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్లలో పోస్టుల భర్తీకి అనుమతి
* ఔట్ సోర్సింగ్ విధానంలో మరో 595 పోస్టులు మంజూరు
* బీసీ గురుకుల విద్యాలయ సంస్థకు మరో 28 రెగులర్, ఔట్ సోర్సింగ్ విధానంలో 10 పోస్టులు మంజూరు

Related Tags :

Related Posts :