దోపిడీ ఆపకుంటే చర్యలు తప్పవు..ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రభుత్వం సీరియస్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై ప్రభుత్వం సీరియస్ అయింది. దోపిడీ ఆపకుంటే ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తప్పవని మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడుతూ డబ్బుల కోసం పేషెంట్లను ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. తీరు మార్చుకోకపోతే ఆస్పత్రులపై వేటు తప్పదని స్పష్టం చేశారు.అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు దోచుకోవడం లేదు కానీ కొన్ని మాత్రం ట్రీట్ మెంట్ కు అయ్యే ఖర్చు కంటే అనేక రెట్లు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వాటిపై కమిటీ వేసి ఎంక్వైరీ చేశారని తెలిపారు. రిపోర్టు వచ్చిన తర్వాత షోకాజ్ నోటీసులు ఇచ్చి తదుపరి చర్యలు చేపట్టామని తెలిపారు.

అయితే తమకు ప్రైవేట్ ఆస్పత్రులను మూసివేసే ఉద్దేశ్యం కాదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిపై వేటు వేయాలనే ఆలోచన లేదన్నారు. అధికంగా వసూలు చేయబోమని ప్రైవేట్ ఆస్పత్రుల యజమాన్యాలు హామీ ఇచ్చాయి కాబట్టి నమ్ముతున్నామని..కానీ నమ్మకాన్ని వమ్ము చేస్తే మాత్రం చర్యలు తప్పవన్నారు.ప్రభుత్వాస్పత్రుల్లో వెంటిలేటర్స్, ఆక్సిజన్ కొరత లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెంటిలేటర్, ఆక్సిజన్ కొరత లేదన్నారు. అన్ని జిల్లా ఆస్పత్రుల్లో పూర్తి స్తాయిలో ఆక్సిజన్, వెంటిలేటర్, మ్యాన్ పవర్ సౌకర్యాలు కల్పించామని తెలిపారు.

Related Posts