బీహార్ నుంచి తెలంగాణకు పొట్టి తాడిచెట్లు..ఎందుకంటే..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెట్లనుంచి తీసే కల్లుకు చాలా డిమాండ్ ఉంది. తాటి, ఈత, కొబ్బరి చెట్ల నుంచి తీసే నీరా పానీయానికి (కల్లు)కు మంచి డిమాండ్ ఉంది. దీంతో కల్లు ఉత్పత్తిని పెంచేందుకు..తద్వారా కల్లుగీత కార్మికులకు ఉపాధి పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తాటి, ఈత, కొబ్బరి చెట్లలో ఎక్కువగా కల్లు లభ్యమయ్యేది తాటి చెట్లనుంచే. అలాగే అందించే పొట్టి తాటి చెట్లను కల్లు విరివిగా లభిస్తుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం పొట్టి తాడి చెట్లను పెంచాలని నిర్ణయించింది. ఈ పొట్టిరకం తాటిచెట్లు బీహార్ లో ఎక్కువగా ఉంటాయి.కాబట్టి బీహార్ నుంచి అధికంగా ఉంటాయి. అందుకే బీహార్ నుంచి పొట్టి తాటిచెట్ల నారును తీసుకువచ్చి పెంచి హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో నాటుతున్నారు.


కేంద్రం సంచలన నిర్ణయం..onion ఎగుమతులు బంద్


పొడుగు తాటిచెట్లు పూర్తిస్థాయిలో పెరిగేందుకు 10 నుంచి 14 ఏళ్ల సమయం పడుతుంది. కానీ ఈ పొట్టి తాడిచెట్ల రకం మాత్రం కేవలం 4 నుంచి 5 ఏళ్లలో పెరుగటమ కాక పొడుగు తాడి చెట్ల కంటే అధికంగా కల్లును ఉత్పత్తి చేస్తుంది. పొట్టి తాటిచెట్టు సీజన్ లో 3 నుంచి 15 లీటర్ల నీరా అందిస్తుంది. అంతేకాదు సీజన్ లో 100 తాటిపండ్లను కూడా అందిస్తుంది.


దీనిపై తెలంగాణ పామ్ ప్రమోటర్స్ సొసైటీ చైర్మన్ విష్ణుస్వరూప్ రెడ్డి మాట్లాడుతూ..2019లో 5 వేల పొట్టి తాటిచెట్లను తెప్పించామని..ఈ సంవత్సరం 1.25 లక్షలు తెప్పిస్తున్నామని చెప్పారు. కాగా..పొడవైన తాటిచెట్లను ఎక్కే సమయంలో కార్మికులు ప్రమాదాల బారినపడే అవకాశం ఉందని, పొట్టి తాటిచెట్లు అయితే అలాంటి ప్రమాదాలు జరగవని భావిస్తున్నారు.


అలాగే రాష్ట్రంలో అక్రమంగా గుబుంబా వ్యాపారం జోరుగా కొనసాగుతున్న క్రమంలో దాన్ని అరికట్టేందుకు..తద్వారా కల్లుగీత కార్మికులకు ఉపాధి లభించేలా చేయటం కోసం ప్రభుత్వం ఈ తాడి చెట్ల పెంపకాన్ని చేపట్టింది. కల్లు లభ్యత పెరిగితే గుడుంబా వ్యాపారానికి అడ్డుకట్టపడుతుందని అధికారులు భావిస్తున్నారు.


5 కోట్లకు పైగా పొట్టి తాడిచెట్లను నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంట్లో భాగంగా హరితహారంలో కార్యక్రమంలో ఈ పొట్టి తాడిచెట్లను కూడా నాటేలా చర్యలు తీసుకుంటున్నారు. రాబోయే మూడేళ్లలో మరో 1.44 కోట్ల తాటి మొక్కలను నాటానున్నామని తెలిపారు.

Related Posts